News November 28, 2024
చంద్రబాబుపై నా ఒపీనియన్ ఎప్పటికీ మారదు: ఆర్జీవీ

AP: NTRను వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చంద్రబాబుపై నాకు సదభిప్రాయం పోయిందని, ఇక అది ఎప్పటికీ మారదని డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ అన్నారు. అందుకే వ్యూహం సినిమాలో ఆయన పాత్ర అలా చూపించానని చెప్పారు. ‘రాజకీయ నేతలు పోలీసులను ఆయుధంగా మార్చుకుని పనిచేస్తున్నారు. ఏడాది కిందట పెట్టిన ట్వీట్పై ఇప్పుడు కేసులు ఏంటీ? నాపై కేసు పెట్టిన 9 మందికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందేమో’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
Similar News
News November 2, 2025
ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే: KTR

TG: రేవంత్ నకిలీ వాగ్దానాలు, బెదిరింపు రాజకీయాలు జూబ్లీహిల్స్ ఓటమితోనే అంతమవుతాయని KTR వ్యాఖ్యానించారు. ‘500 రోజుల్లో KCR తిరిగి సీఎం అవుతారు. ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే. జూబ్లీహిల్స్లో భారీ మెజార్టీతో గెలుస్తాం. రేవంత్ చేసే బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పతనం ఖాయం. రేవంత్కు కాంగ్రెస్తో ఉన్నది ఫేక్ బంధం. BJPతో ఉన్నది పేగు బంధం’ అని విమర్శించారు.
News November 2, 2025
BREAKING: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు

AP: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ల బదిలీలు, నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్గా కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా ఈజీ అశోక్ కుమార్ తదితరులను బదిలీలు, నియామకాలు చేశారు.
News November 2, 2025
4 ప్రాంతాల్లో SIR ప్రీటెస్టు సెన్సస్

AP: ECI దేశవ్యాప్తంగా SIR చేపట్టాలని నిర్ణయించడం తెలిసిందే. దీనిలో భాగంగా తొలివిడత ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ప్రీటెస్టు కోసం ఏపీలో 4 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను ఖరారు చేశారు. అల్లూరి(D) GKవీధి(M), ప్రకాశం(D) పొదిలి(NP), నంద్యాల(D) మహానంది(M), విశాఖ కార్పొరేషన్లోని 2, 3 వార్డులను ఎంపిక చేశారు. వీటిలో ప్రీటెస్ట్ నిర్వహణకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్లను నియమించారు.


