News February 16, 2025
తండ్రులకు నా పర్సనల్ రిక్వెస్ట్: బ్రహ్మానందం

తండ్రులు పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేయాలని నటుడు బ్రహ్మానందం ‘బ్రహ్మా ఆనందం’ ప్రెస్మీట్లో విజ్ఞప్తి చేశారు. ‘20-25 ఏళ్లు దాటాక పిల్లల్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలన్న ఆలోచన రాకూడదు. రెక్కలు వచ్చిన పక్షులు అవే ఎగురుతాయి. ఎగరటాన్ని అలవాటు చేయాలి తప్ప ఇంత వరకే రెక్క ఉండాలంటూ నిబంధనలు పెట్టడం వల్ల మరింత గాడి తప్పే ప్రమాదం ఉంటుంది. మా పిల్లల్ని నేను ఎప్పుడూ ఒక్కసారి కూడా కొట్టలేదు’ అని వెల్లడించారు.
Similar News
News February 19, 2025
విజయవాడ జీజీహెచ్‌లో సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు

AP: విజయవాడ జీజీహెచ్‌లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులను పరామర్శించిన ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జీబీ సిండ్రోమ్ కేసుల చికిత్సకు మెడిసిన్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
News February 19, 2025
లగ్జరీ కంటే సింప్లిసిటినే నాకు ముఖ్యం: రకుల్

తనకు లగ్జరీ కంటే సింప్లిసిటీనే ముఖ్యమని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. అందుకే తన పెళ్లిని చాలా సింపుల్‌గా చేసుకున్నట్లు తెలిపారు. ‘విరాట్ కోహ్లీ-అనుష్కలాగే మేం చాలా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నాం. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యాం. మా వివాహానికి నో ఫోన్ పాలసీ పాటించాం. ఒక్క అతిథి కూడా ఈవెంట్లో ఫోన్‌తో కనిపించలేదు. పెళ్లి జరిగిన 3 రోజులు చాలా ఎంజాయ్ చేశా’ అని ఆమె చెప్పుకొచ్చారు.
News February 19, 2025
మిర్చి రైతులపై జగన్‌వి పచ్చి అబద్దాలు: అచ్చెన్నాయుడు

AP: గుంటూరు మిర్చి యార్డులో మాజీ CM జగన్ పచ్చి అబద్దాలు ఆడారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆయనను చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘జగన్ తన పాలనలో రైతుల కోసం ఒక్క మంచి పని చేయలేదు. ఆయన హయాంలో రైతుల నుంచి ఒక్క గింజా కొనలేదు. డ్రిప్పులు అందించలేదు. ప్రకృతి విపత్తుల సమయంలో ఒక్క పైసా ఇవ్వలేదు. మేం వచ్చి 6 నెలలు కాకముందే గగ్గోలు పెడుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.