News November 18, 2024
మా అల్లుడు బంగారం: సుధా మూర్తి
భారతీయ సాంస్కృతిక విలువల్ని ఆచరణలో చూపుతున్నందుకు బ్రిటన్ Ex PM, అల్లుడు రిషి సునాక్‌ను సుధా మూర్తి ప్రశంసించారు. లండన్‌లో జరిగిన భారతీయ విద్యా భవన్ వార్షిక దీపావళి ఉత్సవాల్లో ఆమె ప్రసంగించారు. ఉత్తమ విద్య ప్రతిఒక్కరూ ఎగరడానికి రెక్కలిస్తే, గొప్ప సంస్కృతి మూలాల్ని పట్టిష్ఠంగా నిలుపుతుందన్నారు. భారతీయ వారసత్వ పునాదులు కలిగిన రిషి సునాక్ గర్వించదగిన బ్రిటిష్ పౌరుడని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2024
Stock Market: బేర్స్ జోరు.. బుల్స్ బేజారు
స్టాక్ మార్కెట్లు మార్నింగ్ సెషన్లో భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మొదటి అరగంట పాటు బెంచ్ మార్క్ సూచీలు రిట్రేస్‌మెంట్ అవ్వకుండా నష్టాలవైపు పయనించాయి. అయితే సెన్సెక్స్ 77,000 పరిధిలో, నిఫ్టీ 23,350 పరిధిలో ఇప్పటికే రెండు సార్లు సపోర్టు తీసుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 459 పాయింట్ల నష్టంతో 77,127 వద్ద, నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో 23,401 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
News November 18, 2024
RGVకి హైకోర్టులో నిరాశ
AP: ప్రకాశం(D) మద్దిపాడు పోలీసులు తనపై నమోదు చేసిన <<14597682>>కేసును <<>>కొట్టివేయాలని దర్శకుడు RGV దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలన్న వర్మ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. పోలీసుల విచారణకూ సమయం ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును RGV కోరగా, ఆ విషయం పోలీసులనే అడగాలని న్యాయస్థానం బదులిచ్చింది.
News November 18, 2024
లగచర్ల ఘటనలో A2పై లుకౌట్ నోటీసులు
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న A2 సురేశ్ కోసం గాలిస్తున్నారు. అతడిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనలో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.