News March 16, 2025

నా బలం నా పేరులో లేదు: మోదీ

image

‘నా బలం నా పేరులో లేదు. 140 కోట్ల ప్రజల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలో ఉంది’ అని ప్రధాని మోదీ చెప్పారు. తనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే దేశ ప్రజలందరికీ ఇచ్చినట్లేనని తెలిపారు. ఒక ఉద్దేశ్యంతో గొప్ప శక్తి తనను ఇక్కడి(భూమి)కి పంపిందని, తానెప్పుడూ ఒంటరి కాదన్నారు. బాల్యంలో తన తండ్రి టీ షాపు వద్దకు వచ్చిన వారి నుంచి చాలా నేర్చుకునేవాడినన్నారు. వాటినే ప్రజా జీవితంలో అప్లై చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 20, 2025

ఆయుష్ మార్క్ అంటే ఏమిటి?

image

బంగారం, వస్త్రాలు, అగ్రి ఉత్పత్తులు, మెడిసిన్ నాణ్యతను ధ్రువీకరించేందుకు హాల్ మార్క్, ISI, AGMARK, GMP లాంటి గుర్తులున్నాయి. ఇదే తరహాలో ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, సిద్ధ, యునాని, హోమియోపతి ఉత్పత్తులు, సేవల క్వాలిటీని Ayush Mark ద్వారా గుర్తించవచ్చు. 2009 నుంచే ఇది ఉన్నప్పటికీ గ్లోబల్ స్థాయి గుర్తింపు కోసం మోదీ సరికొత్తగా ప్రారంభించారు. ఇలాంటి వైద్యానికి వెళ్లినప్పుడు ఈ మార్క్‌ను గుర్తుంచుకోండి.

News December 20, 2025

5 జిల్లాల పరిథిలో అమరావతి ORR

image

AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. భూసేకరణకు కేంద్ర రోడ్డు, రవాణా, హైవే శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. 189 KM మేర 6 లేన్లుగా ఈ నిర్మాణం జరగనుంది. దీని పరిధిలో గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలు రానున్నాయి. 23 మండలాల్లో ఉన్న 121 గ్రామాల్లో భూసేకరణ జరగనుంది. మొత్తం 5789 ఎకరాల భూమిని సేకరించనున్నారు. అభ్యంతరాలకు 21 రోజుల గడువు విధించారు.

News December 20, 2025

ఈ నెల 28 నుంచి అసెంబ్లీ?

image

TG: ఈ నెల 28 నుంచి 3 రోజులపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హిల్ట్ పాలసీ, ఇరిగేషన్, GHMC విలీన ప్రక్రియ, ఫోన్ ట్యాపింగ్‌‌పై సిట్ విచారణ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై ఏసీబీ విచారణ తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే సర్కారు పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో BCలకు పార్టీపరంగా 42% టికెట్లు ఇచ్చే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.