News June 23, 2024
మా జట్టు లేకపోతే భారత్‌కే నా మద్దతు: వివ్ రిచర్డ్స్

T20 WC రేసులో వెస్టిండీస్ లేకపోతే తాను టీమ్ ఇండియాకే మద్దతునిస్తానని మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తెలిపారు. బంగ్లాదేశ్‌పై విజయం అనంతరం బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఇచ్చేందుకు ఆయన భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చారు. ‘మీ జట్టు చాలా బలంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ బాగా ఆడారు. గడ్డు పరిస్థితిని దాటి వచ్చిన పంత్‌ను చూస్తే చాలా ఆనందంగా ఉంది. తను మున్ముందు మరింత ఉన్నతస్థాయికి చేరుకుంటాడు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 19, 2025
కెరమెరి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కెరమెరి మండలం అంబారావుగూడ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ధనోర నుంచి ఆసిఫాబాద్ వైపు బైక్ పై వెళ్తుండగా ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News December 19, 2025
Unknown నంబర్ నుంచి వీడియో కాల్ చేసి..

అన్‌నోన్ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడిన HYD వ్యక్తి బ్లాక్‌మెయిల్‌కు గురై ₹3.41L పోగొట్టుకున్నాడు. మహిళ వీడియో కాల్ చేసి అతడిని సెడ్యూస్ చేయగా, అది వైరల్ చేస్తామంటూ మరో వ్యక్తి బెదిరించాడు. పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. తన బ్యాంక్ అకౌంట్స్ హ్యాకవడం, మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
News December 19, 2025
వైఎస్ జగన్ బర్త్ డే CDP పోస్ట్ చేసిన వైసీపీ

AP: ఎల్లుండి వైసీపీ చీఫ్ జగన్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన CDPని ఆ పార్టీ Xలో పోస్ట్ చేసింది. ప్రజా నాయకుడు జగన్ అని పేర్కొంటూ ఫొటోను రిలీజ్ చేసింది. ‘సవాళ్లు ఎదురైనా.. కష్టాలు పరీక్షించినా మొక్కవోని దీక్షతో నమ్మిన సిద్ధాంతానికి నిబద్ధతతో నిలబడే నాయకుడు వైఎస్ జగన్. పుట్టిన రోజు శుభాకాంక్షలు జగన్ అన్న’ అని ట్వీట్ చేసింది.


