News March 20, 2025
నా టెంపర్మెంట్ ఏం మారలేదు: సీఎం రేవంత్

TG: తాను ముఖ్యమంత్రి అయినా 20 ఏళ్ల క్రితం రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి టెంపర్మెంట్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ తెలిపారు. ‘2004లో ప్రజల్లోకి వచ్చాను. నేటికీ టెంపర్మెంట్లో ఛేంజ్ లేదు. సీఎంగా హుందాగా వ్యవహరించాలని కొంతమంది అంటుంటారు కానీ అలా వ్యవహరిస్తే అటువైపు అర్థం చేసుకునేవారు ఉండాలి కదా? టెంపర్మెంట్ పోతే న్యాయం చేయలేం. నా దూకుడు పోలేదు కానీ జ్ఞానం పెరిగింది’ అని తెలిపారు.
Similar News
News March 21, 2025
స్కూళ్లలో అల్పాహారం పథకం పెట్టాలి: KTR

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని KTR డిమాండ్ చేశారు. ‘తమిళనాడులో ఈ స్కీమ్‌ను అమలు చేయడం వల్ల ఆస్పత్రిలో చేరే పిల్లల సంఖ్య 63.2% తగ్గింది. తీవ్ర అనారోగ్య సమస్యలు 70.6% తగ్గాయి. విద్యార్థుల అభ్యాసం మెరుగుపడింది. ఈ ఫలితాలను చూసి BRS ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది’ అని ట్వీట్ చేశారు.
News March 21, 2025
పట్టుబడిన కీచక ప్రొఫెసర్.. వెలుగులోకి కీలక విషయాలు

విద్యార్థినులపై లైంగిక దాడి చేసి పరారీలో ఉన్న UPలోని హథ్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ రజినీష్ కుమార్ పోలీసులకు దొరికాడు. మార్కులు వేస్తానని, ఉద్యోగాల పేరుతో అమ్మాయిలపై కొన్నేళ్లుగా అత్యాచారం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. లైంగిక దాడి దృశ్యాలు రికార్డ్ చేయడానికి అతను కంప్యూటర్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాడన్నారు. నిందితుడికి 1996లో పెళ్లైనా పిల్లలు లేరని తెలిపారు.
News March 21, 2025
బ్యాడ్మింటన్‌లో సంచలనం

బ్యాడ్మింటన్ టోర్నీ స్విస్ ఓపెన్ 2025లో భారత షట్లర్ శంకర్ ముత్తుస్వామి సంచలనం నమోదు చేశారు. వరల్డ్ నం.2 ర్యాంకర్ అండర్స్ ఆంటోన్సన్పై విజయం సాధించారు. 18-21, 21-12, 21-5 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.