News December 1, 2024
మామయ్య అస్థిపంజరమే అతడి గిటార్!
గ్రీస్కు చెందిన యూట్యూబర్ ప్రిన్స్ మిడ్నైట్ గిటార్ అద్భుతంగా ప్లే చేస్తాడు. కానీ ఆ గిటార్ అతడి మామయ్య ఫిలిప్ అస్థిపంజరం నుంచి తయారుచేసుకున్నాడు. ‘20 ఏళ్ల క్రితం మామయ్య చనిపోయినప్పుడు ఆయన కోరిక ప్రకారం శరీరాన్ని మెడికల్ స్కూల్కి ఇచ్చేశాం. అస్థిపంజరాన్ని వాళ్లు ఈమధ్య తిరిగిచ్చేశారు. ఏం చేయాలో తెలియలేదు. గిటార్గా మారిస్తే ఆయన నాతోనే ఉన్నట్లు ఉంటుందనిపించి ఇలా చేశాను’ అని ప్రిన్స్ తెలిపారు.
Similar News
News December 1, 2024
రైతుభరోసాపై క్లారిటీ ఇవ్వని సీఎం!
TG: నిన్న పాలమూరులో జరిగిన రైతు సదస్సులో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. సన్నరకం వరికి బోనస్ ఇస్తుండటంతో రైతు భరోసా నిధులను పక్కనబెట్టేసినట్లేనని ప్రచారం జరుగుతోంది. సీఎం దీనిపై ప్రకటన చేస్తే క్లారిటీ వచ్చేది. కానీ అలాంటిదేమీ జరగలేదు. మరోవైపు రైతులు బోనస్కే ప్రాధాన్యత ఇస్తున్నారని అంతకుముందు మంత్రి తుమ్మల వ్యాఖ్యానించడంతో రైతుభరోసాపై అయోమయం నెలకొంది.
News December 1, 2024
ఇవాళ, రేపు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు!
AP: ఫెంగల్ తుఫాన్ తీరం దాటడంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్నారు. గంటకు 90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
News December 1, 2024
తుఫాన్.. తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
TG: ఫెంగల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40-50kms వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ భద్రాద్రి, ఖమ్మం, NLG, SRPT, MBNR, నాగర్ కర్నూల్, WNP, నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు, రేపు MBNR, WGL, HNK, జనగామ, SDPT, భద్రాద్రి, KMM, NLG, SRPT, NGKL, MHBD, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.