News August 7, 2024

వచ్చే ఏడాదే నా పెళ్లి: నటి

image

వచ్చే ఏడాది తాను పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు నటి ప్రియా భవానీ శంకర్ తెలిపారు. ‘రాజ్‌తో పదేళ్లుగా రిలేషన్‌లో ఉన్నా. వివాహం చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ సమయం దొరకక కుదరటం లేదు. వచ్చే ఏడాది తప్పకుండా ఏడడుగులు నడుస్తాం’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా నాగచైతన్య సరసన ‘ధూత’ వెబ్‌సిరీస్‌లో ప్రియా నటించారు. ఇటీవల విడుదలైన ‘భారతీయుడు2’ లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.

Similar News

News November 28, 2025

అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్: నారాయణ

image

AP: అమరావతిలో రైల్వేస్టేష‌న్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కోస‌మే మరో 16వేల ఎకరాలను సమీకరిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి చెంద‌దని.. అందుకే ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ క‌ట్టాల‌ని సీఎం నిర్ణ‌యించార‌న్నారు. గ‌తంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎక‌రాలు మాత్ర‌మే కేటాయించగా ఇప్పుడు 2,500 ఎక‌రాలు ఇచ్చామని వివరించారు.

News November 28, 2025

డిసెంబర్ పెన్షన్లకు రూ.2,739 కోట్లు విడుదల

image

AP: సీఎం చంద్రబాబు డిసెంబర్ 1న ఏలూరు జిల్లా గోపాలపురంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. DEC పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,738.71 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63,25,999 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో నూతనంగా 8,190 పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.21,280 కోట్లు అందజేశామని వివరించారు.

News November 28, 2025

వాషింగ్ మెషీన్.. ఈ జాగ్రత్తలు తెలుసా?

image

నిన్న HYDలో వాషింగ్ మెషీన్ <<18404735>>పేలడంతో<<>> చాలా మంది భయపడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. *రెగ్యులర్‌గా ఫిల్టర్ క్లీన్ చేసుకోవడంతో పాటు సర్వీసింగ్ చేయించాలి *టూల్స్ మార్చాల్సి వస్తే బ్రాండెడ్‌వే వాడాలి *ఎక్కువ లోడ్ (దుస్తులు) వేయొద్దు. దీన్ని వల్ల ఒత్తిడి పెరుగుతుంది *ఏదైనా పెద్ద శబ్దం, వాసన వస్తే వెంటనే ప్లగ్ తీసి టెక్నీషియన్‌ను పిలవాలి.