News October 22, 2024
నా భార్యకు నేను నటించడం ఇష్టం ఉండేది కాదు: విక్రమ్

తాను సినీ ఫీల్డ్‌లో ఉండటం తన భార్యకు ఇష్టం ఉండేది కాదని తమిళ నటుడు విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా భార్య శైలజ, నేను తొలిసారి మీట్ అయ్యే టైమ్‌కి ఓ షూట్లో ప్రమాదం వల్ల తీవ్ర గాయాలతో ఉన్నాను. దాంతో నేను సినిమాలు చేయడం తనకిష్టం ఉండేది కాదు. దానికి తోడు వాళ్ల కుటుంబమంతా కవులు, మేధావులే. కానీ నేను నటనను వదులుకోలేకపోయాను. ఇప్పుడు తను మారిపోయింది. నాకు పూర్తి మద్దతుగా నిలుస్తోంది’ అని తెలిపారు.
Similar News
News November 20, 2025
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటన

ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు. 22న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరగనున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ఆమె హాజరవుతారని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. తొలుత 21న హైదరాబాద్‌లో ‘భారతీయ కళామహోత్సవ్- 2025’ను రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. అనంతరం శనివారం పుట్టపర్తికి వెళ్లనున్నారు.
News November 20, 2025
చెరకు పంటను ఇలా నరికితే ఎక్కువ లాభం

చెరకు పంటను నరికేటప్పుడు గడలను భూమట్టానికే నరకాలి. కొన్ని ప్రాంతాల్లో భూమి పైన రెండు, మూడు అంగుళాలు వదిలేసి నరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల రైతుకు నష్టం. మొదలు కణపులలో పంచదార పాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటు పంచదార అటు బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికి ఖాళీ చేసిన తోటల్లో వేళ్లు లోతుగా చొచ్చుకెళ్లి తోట బలంగా పెరిగి వర్షాకాలంలో వచ్చే ఈదురు గాలులు, వర్షాలను కూడా తట్టుకుంటుంది.
News November 20, 2025
Op Sindoor: రఫేల్ జెట్లపై చైనా తప్పుడు ప్రచారం!

‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో చైనా తప్పుడు ప్రచారం చేసిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ‘ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నకిలీ ఫొటోలను చైనా వ్యాప్తి చేసింది. రఫేల్ యుద్ధ విమానాలను తమ క్షిపణులతో కూల్చేసినట్లుగా ప్రచారం చేసుకుంది’ అని US-చైనా ఎకనమిక్, సెక్యూరిటీ రివ్యూ కమిషన్
తెలిపింది. రఫేల్ జెట్లపై నమ్మకాన్ని దెబ్బతీసి, తమ J-35 విమానాలకు డిమాండ్ పెంచుకోవాలని చైనా కుట్ర పన్నినట్లు ఆరోపించింది.


