News December 16, 2024
బంగ్లా ప్రాంతాల్ని ఆక్రమించిన మయన్మార్ రెబల్స్?

బంగ్లాకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కుదేలైన ఎకానమీని యూనస్ నిలబెట్టడం లేదు. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు కరెంటు లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. తాజాగా మయన్మార్ రెబల్స్ 275KM మేర బంగ్లా సరిహద్దును అధీనంలోకి తీసుకోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడ వాణిజ్య సేవల్ని నిలిపేసి ఆంక్షలు అమలు చేస్తోంది. బంగ్లాలోని టెక్నాఫ్ సహా కొన్ని ప్రాంతాలను రెబల్స్ ఆక్రమించారని సమాచారం.
Similar News
News November 23, 2025
ఈ నెల 28న అమరావతికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

ఈ నెల 28న రాజధాని అమరావతిలో పలు బ్యాంక్ భవనాలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ బ్యాంకులకు CRDA భూకేటాయింపులు చేసింది. శంకుస్థాపన అనంతరం CRDA ప్రధాన కార్యాలయం దగ్గర సభకు నిర్మలా సీతారామన్, పెమ్మసాని, చంద్రబాబు, పవన్ హాజరు కానున్నారు.
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>


