News April 5, 2024

ఆన్‌లైన్లో ఆరోగ్య సేవలకు ‘myCGHS’ యాప్‌

image

సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్(CGHS) లబ్ధిదారులకు ఆన్‌లైన్‌ ద్వారా సేవలు అందించేందుకు ప్రభుత్వం ‘మైసీజీహెచ్‌ఎస్‌’ యాప్‌ను ప్రారంభించింది. IOS ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్న ఫోన్లలో ఇది పని చేస్తుంది. ఈ యాప్‌లో ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ బుకింగ్‌, క్యాన్సిల్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. లబ్ధిదారుల ఆరోగ్య రికార్డులు కూడా అందుబాటులో ఉంటాయి.

Similar News

News October 19, 2025

ఆసీస్‌పై పైచేయి సాధిస్తామా?

image

నేడు భారత్, AUS మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 152సార్లు తలపడగా ఆసీస్ 84 మ్యాచుల్లో గెలిచి ఆధిపత్యం చెలాయిస్తోంది. అటు ఆ దేశంలోనూ మన రికార్డ్ పేలవంగానే ఉంది. 54 వన్డేల్లో కేవలం 14సార్లే మనం గెలిచాం. ఈ క్రమంలో తాజా సిరీస్‌ను కైవసం చేసుకొని పైచేయి సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇవాళ తొలి వన్డే జరిగే పెర్త్‌లో పరుగులు రాబట్టడం కష్టమే అని క్రీడా విశ్లేషకుల అంచనా.

News October 19, 2025

దీపావళి: లక్ష్మీ పూజలు ఏ రోజున జరపాలి?

image

ఈ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య ఘడియలు సూర్యాస్తమయానికి ఆ రోజునే ఉండటంతో.. అదే రోజు దీపావళిని జరుపుకోవడం శ్రేయస్కరం అని అంటున్నారు. ‘లక్ష్మీదేవి పూజ కోసం శుభ ముహూర్తం అక్టోబర్ 20న రాత్రి 7.08 గంటల నుంచి 8.18 గంటల వరకు ఉంటుంది. భక్తులు ఈ ప్రదోష కాలంలో లక్ష్మీ పూజ చేసి, దీపాలు వెలిగించి, అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు’ అని సూచిస్తున్నారు.

News October 19, 2025

తెలంగాణ రౌండప్

image

➤ 3,465 మంది సర్వేయర్లకు నేడు HYDలోని శిల్పకళావేదికలో లైసెన్స్‌లు అందజేయనున్న సీఎం రేవంత్
➤ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్‌తో సహా 40 మంది రంగంలోకి.. నిన్నటి వరకు 96 నామినేషన్లు దాఖలు
➤ 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షిప్, బోధనా రుసుము దరఖాస్తు గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
➤ 34 R&B రహదారులను రూ.868 కోట్లతో బలోపేతం, విస్తరణకు పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం