News January 16, 2025
J&Kలో మిస్టరీ: నెలన్నరలో ఒకే ఊరిలో 15 మంది మృతి

J&K రాజౌరీ(D)లోని బుధాల్లో మిస్టరీ మరణాలు కలవరపెడుతున్నాయి. నెలన్నరలోనే 15 మంది చనిపోవడంతో ప్రభుత్వం SITను ఏర్పాటుచేసింది. DEC 7న విందు ఆరగించిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, DEC 12న మరో సహపంక్తి భోజనం చేసిన వారిలో ముగ్గురు, JAN 12న మరొకరు మృతిచెందారు. ఇలా పలు ఘటనల్లో 15 మంది చనిపోయారు. ఆహార, నీటి నమూనాల్లో విష పదార్థాలు ఉండటంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 1, 2025
ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి: CM

TG: ఫ్యూచర్ సిటీ, మెట్రోరైల్ విస్తరణ, RRR, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలని CM రేవంత్ హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. అత్యధిక వడ్డీతో ఇచ్చిన లోన్లను రీకన్స్ట్రక్షన్ చేయాలన్నారు. మరో 10L ఇళ్ల నిర్మాణానికి రుణాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై హడ్కో ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. గ్రీన్ఫీల్డ్ రోడ్లు, బుల్లెట్ ట్రైన్ అంశాలపైనా వారు చర్చించారు.
News December 1, 2025
‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్’ యాప్

TG: ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ID నంబర్తో కూడిన ‘భూధార్’ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. భూముల యాజమాన్య హక్కుల ఆధారంగా రైతులకు అందించనుంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే ‘mభూధార్’ ప్రత్యేక యాప్ను ప్రారంభించింది. స్థానిక ఎన్నికల అనంతరం 2026 JAN నుంచి ఇవి పంపిణీ అవుతాయి. వీటితో భూ వివాదాల తగ్గుదల, సులభ లావాదేవీలు, డిజిటలైజేషన్, పథకాల సక్రమ అమలుకు అవకాశం ఉంటుంది.
News December 1, 2025
హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CBN

AP: విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలూరు(D) నల్లమాడులో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన అక్కడి సభలో మాట్లాడారు. ‘94% స్ట్రైక్ రేట్తో గెలిపించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.


