News March 20, 2025

OTTలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ

image

మలయాళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ OTTలో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతోపాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఈ నెల 14న తెలుగులో థియేటర్లలో విడుదలైంది. రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వచ్చేసింది. రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకుపైగా రాబట్టింది. ఈ చిత్రంలో కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు.

Similar News

News February 12, 2026

మంత్రాలయ మహాత్యం

image

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి బృందావనం అతి పవిత్రమైనది. 1671లో స్వామివారు సజీవంగా బృందావన ప్రవేశం చేశారు. ఆయన భౌతికంగా మనకు కనిపించకపోయినా, మరో 700 ఏళ్ల పాటు అందులోనే ఉంటూ అనుగ్రహిస్తారని ప్రతీతి. కల్పవృక్షంలా కోరిన కోర్కెలు తీర్చే ఈ క్షేత్రానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. స్వామివారికి సమర్పించే ‘మృత్తిక’ (పవిత్ర మట్టి) సకల వ్యాధులను, గ్రహ దోషాలను నివారిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News February 12, 2026

ఫిబ్రవరి 12: చరిత్రలో ఈరోజు

image

➤ 1809: బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జననం
➤ 1809: అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జననం
➤ 1824: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జననం
➤ 1961: శుక్ర గ్రహంపైకి తొలిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1)
➤ 1962: సినీ నటుడు జగపతిబాబు జననం(ఫొటోలో)
➤ 1968: నటుడు పువ్వుల సూరిబాబు మరణం
➤ 2019: సినీ దర్శకుడు విజయ బాపినీడు మరణం

News February 12, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.