News September 21, 2025

మైథాలజీ క్విజ్ – 12

image

1. లక్ష్మణుడి భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
2. మహాభారతంలో సత్యవతి, శంతనుల కుమారులు ఎవరు?
3. వేదాల ప్రకారం.. మొదట మరణించిన వ్యక్తి ఎవరు?
4. మానస సరోవరం ఏ దేశంలో ఉంది?
5. సమ్మక్క సారలమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు.
<<-se>>#mythologyquiz<<>>

Similar News

News September 21, 2025

టెన్త్, ఇంటర్‌తో 1,446 ఉద్యోగాలు.. నేటితో ముగియనున్న దరఖాస్తులు

image

ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గ్రౌండ్ స్టాఫ్, లోడర్ ఉద్యోగాల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మొత్తం 1,446 ఉద్యోగాలు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు (18-30 ఏళ్లు) ఇంటర్మీడియట్, లోడర్ పోస్టులకు (20-40 ఏళ్లు) టెన్త్ పాసై ఉండాలి. జీతం నెలకు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు ఉంటుంది. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 21, 2025

దసరా ఉత్సవాలు: కనకదుర్గమ్మ 11 అలంకారాలు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు రేపటి నుంచి OCT 2 వరకు జరగనున్నాయి. 11 రోజుల పాటు దుర్గమ్మ 11 అలంకారాలలో దర్శనమివ్వనున్నారు.
*SEP 22:బాలాత్రిపుర సుందరీ దేవి *23:గాయత్రీ దేవి *24:అన్నపూర్ణాదేవి *25:కాత్యాయనీ దేవి *26:మహాలక్ష్మీ దేవి *27:లలితా త్రిపుర సుందరీ దేవి *28:మహాచండీ దేవి *29:సరస్వతీ దేవి *30:దుర్గాదేవి *అక్టోబర్ 1:మహిషాసురమర్దిని దేవి *అక్టోబర్ 2:రాజరాజేశ్వరీ దేవి

News September 21, 2025

పత్తిలో పూత, కాయలు రాలిపోతున్నాయా?

image

పత్తి పంట నీటి ముంపునకు గురైనప్పుడు పూత, పిందె, కాయలు రాలిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటప్పుడు ముందుగా పొలంలోని నీటిని తీసివేయాలి. ఎండ ఉన్న సమయంలో ఎకరాకు 25 కేజీల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ బూస్టర్ డోస్‌గా వేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అలాగే లీటరు నీటికి 5-10 గ్రా. పొటాషియం నైట్రేట్ పిచికారీ చేస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
<<-se>>#COTTON<<>>