News September 25, 2025

మైథాలజీ క్విజ్ – 16 సమాధానాలు

image

1. అరణ్యవాసం పూర్తయ్యే వరకు భరతుడు సింహాసనంపై శ్రీరాముడి ‘పాదుకలు’ పెట్టి పరిపాలిస్తాడు.
2. గాంధారి సోదరుడు ‘శకుని’.
3. కృష్ణుడి బాల్య స్నేహితుడు ‘సుదాముడు’.
4. దసరా ఉత్సవాల్లో భాగంగా బన్నీ ఉత్సవానికి ప్రసిద్ధి చెందిన దేవరగట్టు కర్నూలు జిల్లాలో(AP) ఉంది.
5. అధికారం చెలాయించే క్షత్రియులను శిక్షించి, భూమిపై ధర్మాన్ని స్థాపించడం కోసం విష్ణువు పరశురాముడి అవతారం ఎత్తాడు.
<<-se>>#mythologyquiz<<>>

Similar News

News January 17, 2026

మేడారం జాతర.. ఆర్టీసీ ఛార్జీల వివరాలివే

image

TG: మేడారం జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నడిచే RTC ఎక్స్‌ప్రెస్ బస్సుల ఛార్జీల వివరాలను అధికారులు ప్రకటించారు. గోదావరిఖని నుంచి ₹400, హుజూరాబాద్ ₹320, హుస్నాబాద్ ₹350, కరీంనగర్ ₹390, పెద్దపల్లి ₹420, మంథని ₹350, కొత్తగూడెం ₹350, భద్రాచలం- ₹300, మణుగూరు ₹210, ఏటూరునాగారం ₹80, మంగపేట ₹110, పాల్వంచ ₹310, ఖమ్మం ₹480, కాళేశ్వరం ₹360, బెల్లంపల్లి ₹520, ఆసిఫాబాద్ నుంచి ₹590గా ఖరారు చేశారు.

News January 17, 2026

పశువుల్లో సంక్రమిత వ్యాధులు అంటే ఏమిటి?

image

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో చాలావరకు బాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌, పరాన్నజీవుల వల్లే వస్తాయి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, స్రావాలు, శ్వాస ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు బయటకు విడుదలవుతాయి. ఇవి ఇతర పశువులకు ఆహారం, నీరు, గాలి, గాయాల ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధి సోకిన పశువుల పాలను సరిగా మరిగించకుండా, మాంసాన్ని బాగా ఉడికించకుండా తింటే మనుషులకూ వ్యాపిస్తాయి. వీటినే ‘సంక్రమిత వ్యాధులు’ అంటారు.

News January 17, 2026

సార్.. జాబ్ క్యాలెండర్ ప్లీజ్: నిరుద్యోగులు

image

AP: ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ గతంలో <<18617902>>ప్రకటించిన<<>> విషయాన్ని గుర్తుచేస్తున్నారు. 25వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ Xలో పోస్టులు పెడుతున్నారు. ఉద్యోగాల కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అంటున్నారు.