News September 16, 2025
మైథాలజీ క్విజ్ – 7

1. మహావిష్ణువు ద్వారపాలకులెవరు?
2. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది?
3. భీష్ముడి అసలు పేరేంటి?
4. గంగోత్రి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. భాద్రపద మాసంలో చవితి రోజున వచ్చే పండుగ ఏది?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పై ప్రశ్నలకు జవాబులను మైథాలజీ క్విజ్ – 8 (రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
<<17697694>>మైథాలజీ క్విజ్-6 <<>>జవాబులు: 1.18 వేలు 2.దండకారణ్యం 3.మధుర 4.గుజరాత్ 5.రాఖీ
Similar News
News February 5, 2026
విటమిన్ E నేరుగా అప్లై చేస్తున్నారా?

ముఖంపై పిగ్మెంటేషన్‌ను తగ్గించడానికి చాలామంది విటమిన్ E క్యాప్య్సూల్స్ వాడుతుంటారు. అయితే వీటిని నేరుగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. వీటిని ముఖంపై డైరెక్ట్‌గా వాడితే అలర్జీ, ర్యాషెస్ రావొచ్చంటున్నారు. ఈ క్యాప్య్సూల్స్ నోటి ద్వారా తీసుకోవడానికి ఉద్దేశించినవని చెబుతున్నారు. కచ్చితంగా వీటిని వాడాలనుకుంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
News February 5, 2026
260 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(CSL)లో 260 వర్క్‌మెన్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(FEB 7) ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ITI, NTCతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు (రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). నెలకు రూ.23,300 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: cochinshipyard.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News February 5, 2026
ట్రంప్ బెదిరింపులకు భారత్ తలొగ్గదు.. వెలుగులోకి కొత్త విషయాలు!

IND-US ట్రేడ్ డీల్‌పై గతేడాది SEPలో జరిగిన కీలక చర్చల వివరాలు వెలుగులోకి వచ్చాయి. భారత్, PM మోదీపై ట్రంప్, ఉన్నతాధికారులు నోరుపారేసుకోవడాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఖండించినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ‘50% టారిఫ్‌ల బెదిరింపులకు IND తలొగ్గదు. అవసరమైతే ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచిచూస్తాం. మాపై విమర్శలు తగ్గిస్తేనే సంబంధాలు మెరుగుపడతాయి’ అని తేల్చిచెప్పినట్లు పేర్కొంది.


