News August 24, 2024
N-కన్వెన్షన్ సెంటర్.. వివాదం ఇదే

TG: హీరో నాగార్జున, నల్ల ప్రీతమ్ రెడ్డి కలిసి సంయుక్తంగా HYD మాదాపూర్‌లో N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో N-కన్వెన్షన్ సెంటర్‌ను 2015లో నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండగా.. 1.12 ఎకరాలు <<13929381>>FTL పరిధిలో<<>>, 2 ఎకరాల <<13924900>>బఫర్ జోన్‌ను <<>>ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది.
Similar News
News December 3, 2025
సమ్మిట్‌కు రావాలని కాంగ్రెస్ పెద్దలకు ఆహ్వానం

ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025కు హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని కోరినట్లు పెద్దపల్లి MP వంశీకృష్ణ తెలిపారు. CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, MPలతో కలిసి ఢిల్లీ వెళ్లిన వంశీకృష్ణ బుధవారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. రాష్ట్రంలోని మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి ప్రాధాన్యతపై చర్చించారు.
News December 3, 2025
ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టాలి: CBN

AP: వ్యవసాయోత్పత్తులు గ్లోబల్ బ్రాండ్‌గా మారాలని తూ.గో.జిల్లా నల్లజర్లలో ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు పెట్టుకోవాలి. ఫ్యాక్టరీలు, మార్కెట్‌తో అనుసంధానమవ్వాలి. ఏ పంటలతో ఆదాయమొస్తుంది? ఏ కాంబినేషన్ పంటలు వేయాలి? పరిశ్రమలకు అనుసంధానం ఎలా చేయాలి? రైతులే పరిశ్రమలు ఎలా పెట్టాలన్న అంశాలపై ప్రభుత్వం సహకరిస్తుంది’ అని తెలిపారు.
News December 3, 2025
మీక్కూడా ఫేవరెట్ కిడ్ ఉన్నారా?

చాలా కుటుంబాల్లో తెలియకుండానే ‘ఫేవరెట్ కిడ్’ ప్రభావం కనిపిస్తుందంటున్నారు నిపుణులు. తల్లిదండ్రుల ప్రేమలో తేడా లేకపోయినా.. చిన్నచిన్న సందర్భాల్లో ఈ పక్షపాతం బయట పడుతుంది. కొన్నిసార్లు ఒకరితో ఎక్కువ ఓపికగా, ఆప్యాయంగా ఉండటం చేస్తుంటారు. కొన్నిసార్లు ఇది తల్లిదండ్రులు కూడా గ్రహించకపోవచ్చు. తల్లిదండ్రులు తమను తక్కువగా చూస్తున్నారనే భావన పిల్లల్లో నెగెటివ్ ఆలోచనలను పెంచుతుందని చెబుతున్నారు.


