News August 24, 2024

N కన్వెన్షన్‌కు నిర్మాణ అనుమతులు లేవు: హైడ్రా కమిషనర్

image

TG: నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌కు GHMC నుంచి నిర్మాణ అనుమతులు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమతుల కోసం ప్రయత్నించారని, కానీ అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు. ‘తుమ్మిడికుంట చెరువులోని FTLలో 1.12 ఎకరాల్లో, బఫర్ జోన్‌లోని 2.18 ఎకరాల్లో కన్వెన్షన్ నిర్మించారు. N కన్వెన్షన్‌‌తో సహా అక్రమ నిర్మాణాలు కూల్చేశాం’ అని పేర్కొన్నారు.

Similar News

News March 15, 2026

ఎండల తీవ్రత.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

image

వేసవిలో కోళ్లకు అందించే దాణా, నీటి పరిమాణం 1:2 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే 1:4 నిష్పత్తిలో ఉండాలి. నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్స్ కలిపితే కోళ్లు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. వీలైనంత వరకు కోళ్లకు ఎండలో ఉండే నీరు కాకుండా చల్లగా ఉండే నీటినే ఇవ్వాలి. కోళ్ల షెడ్లపైన గడ్డి కప్పి, స్ప్రింకర్లు అమర్చి.. షెడ్డు లోపల ఫాగర్స్‌తో ఎండ సమయంలో అరగంటకు ఒకసారి నీరు చల్లాలి.

News March 15, 2026

సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు ఎందుకు?

image

సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి. అలాగే ఇంద్రధనస్సులోని 7 రంగులకు సంకేతాలుగానూ చెబుతారు. ఇవి వేదాలలోని 7 ఛందస్సులను కూడా సూచిస్తాయని పండితులు అంటున్నారు. ఈ రథానికి ఉండే ఒకే ఒక్క చక్రం సంవత్సరానికి ప్రతీక. దానిలో ఉండే 12 ఆకులు 12 నెలలకు ప్రతీకలుగా చెబుతారు. సూర్యుని సోదరుడైన అరుణుడు ఈ రథానికి సారథి. సూర్యుని తీవ్రమైన వేడిని ఆయన భరిస్తూ, భూమిపై ప్రాణకోటిని కాపాడతాడు.

News March 15, 2026

పిల్లలకు ఈ పోషకాలు తప్పక ఇవ్వండి

image

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్లు, మినరల్స్ అన్నీ తగినంత అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు A, B, C, D, E, అండ్ K వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పిల్లలకు చాలా అవసరం. ఆరోగ్యకరమైన అభివృద్ధికి వారికి ఫోలేట్, కాల్షియం, అయోడిన్, ఇనుము, జింక్ కూడా కావాలి. ఈ పోషకాలు పిల్లల మెదడు, నరాల అభివృద్ధి, కంటి చూపు, ఎముకల బలం, రోగనిరోధక శక్తి, జీవక్రియకు సహకరిస్తాయి.