News November 27, 2024

బజరంగ్ పునియాకు NADA షాక్

image

జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) రెజ్లర్ బజరంగ్ పునియాకు షాక్ ఇచ్చింది. డోప్ పరీక్షకు నమూనా ఇచ్చేందుకు నిరాకరించినందుకు 4 ఏళ్ల నిషేధం విధించింది. జాతీయ జట్టు ట్రయల్స్ వేళ గత మార్చి 10న డోపింగ్ టెస్టుల కోసం పునియా శాంపిల్ ఇవ్వలేదు. దీంతో ఏప్రిల్‌లో తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీనిపై నాడా క్రమశిక్షణ ప్యాన‌ల్‌ను బజరంగ్ ఆశ్రయించగా, విచారణలో దోషిగా తేలడంతో నిషేధం అమల్లోకి వచ్చింది.

Similar News

News November 27, 2024

2025లో 8 మంది ఏపీ ఐఏఎస్‌ల రిటైర్మెంట్

image

ఏపీ క్యాడర్‌కు చెందిన 8 మంది ఐఏఎస్‌లు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య రిటైర్ కానున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సీఎస్ నీరబ్ తాజాగా జారీ చేశారు. ఈ లిస్టులో సుమితా దావ్రా, కె.హర్షవర్ధన్(మార్చి 31), కె.విజయానంద్ (నవంబర్ 30), జి.వాణీమోహన్ (ఫిబ్రవరి 28), KRBHN చక్రవర్తి, ఎం.హరి జవహర్ లాల్, ఎస్.సత్యనారాయణ(జూన్ 30), కె.శారదా దేవి (జులై 31) ఉన్నారు.

News November 27, 2024

కులగణన డేటాను పబ్లిక్ డొమైన్‌లో పెడతాం: పొన్నం

image

TG: పారదర్శకంగా కులగణన చేపడుతున్నామని, అది పూర్తికాగానే డేటాను పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అనంతరం ప్రజలతో చర్చించి సామాజిక న్యాయం అమలు చేస్తామని చెప్పారు. జనాభా నిష్పత్తి ప్రకారం సంక్షేమ ఫలాలు పంచేందుకు స్కీమ్స్ తీసుకొస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణన దేశానికి దిక్సూచిగా నిలవబోతోందని పొన్నం అన్నారు.

News November 27, 2024

ప్రపంచంలోనే అత్యధిక వయస్కుడు మృతి

image

ప్రపంచంలో అత్యధిక వయసుగల వ్యక్తిగా పేరొందిన జాన్ టిన్నిస్‌వుడ్ కన్నుమూశారు. ఆయన వయసు 112 ఏళ్లు. బ్రిటన్‌లోని సౌత్‌పోర్ట్‌‌లో జాన్ సోమవారం కన్నుమూసినట్లు ఆయన కుటుంబం ప్రకటించింది. 1912లో జన్మించిన జాన్‌ను ఈ ఏడాది APRలో వరల్డ్ ఓల్డెస్ట్ మెన్‌గా గిన్నిస్ బుక్ గుర్తించింది. టైటానిక్ ఓడ మునిగిన ఏడాదే(1912) ఆయన పుట్టడంతో ఆ విధంగానూ జాన్ ప్రాచుర్యం పొందారు. ఆయన జీవితాంతం లివర్‌పూల్ FC అభిమానిగా ఉన్నారు.