News October 29, 2024

హెజ్బొల్లా చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్

image

ఇరాన్ మద్దతు గల లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్ ఎంపికయ్యారు. హసన్ నస్రల్లా మృతి చెందడంతో ఆయన స్థానంలో నయీమ్‌ను నియమించారు. నయీమ్ ఇప్పటివరకు హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్‌గా కొనసాగారు. నస్రల్లాతో కలిసి ఆయన యాక్టివ్‌గా పనిచేశారు. నయీమ్ 1953లో దక్షిణ లెబనాన్‌లోని క్ఫర్ ఫిలాలో జన్మించారు. తొలుత ఆయన కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేశారు. 1982లో హెజ్బొల్లాలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.

Similar News

News October 25, 2025

US, EU ఆంక్షలను పాటిస్తాం: రిలయన్స్

image

రష్యా చమురు కంపెనీలపై అమెరికా, ఈయూ ఆంక్షలను పాటిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని, ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని వెల్లడించింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలు రాస్‌నెఫ్ట్, లాకాయిల్‌పై అమెరికా, ఈయూ ఆంక్షలు విధించాయి. ఆ రెండు సంస్థలతో వ్యాపారాన్ని నవంబర్ 21 నాటికి ముగించాలని రిఫైనరీలను ఆదేశించాయి.

News October 25, 2025

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

TG: రాష్ట్రంలో రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రేపు ఉ.8.30గంటల లోపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలకు అవకాశమున్నట్లు చెప్పింది.

News October 24, 2025

సమ్మె విరమిస్తున్నాం: వైద్య సంఘాలు వెల్లడి

image

AP: తమ డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టమైన హామీలు ఇచ్చినందున సమ్మెను విరమిస్తున్నట్లు పీహెచ్సీ, ఏపీవీవీపీ వైద్యుల సంఘం నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఆయన్ను కలిసి మాట్లాడారు. పీజీ మెడికల్ ఇన్ సర్వీసు కోటాను 20%, 2026–27లో 15% కోటాను సాగించేందుకు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. గతంలో అమల్లో ఉండి నిలిచిన DNB కోర్సుల్లో ప్రవేశాలు, తదితర విషయాల్లోనూ మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.