News March 4, 2025
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు?

AP: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఒకటి జనసేన తరఫున నాగబాబుకు ఖరారైనట్లు సమాచారం. కాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు కూడా ఆయనను మంత్రిమండలిలోకి తీసుకుంటామని ప్రకటించారు.
Similar News
News March 4, 2025
ప్రమాదకరంగా ఫ్యాటీ లివర్.. ఇలా చేయాల్సిందే

చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందర్నీ పట్టి పీడిస్తున్న సమస్య కాలేయపు కొవ్వు(ఫ్యాటీ లివర్). ప్యాకేజ్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, మద్యపానం వంటి అలవాట్లు, అధిక బరువు వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంటుంది. జంక్ ఫుడ్, డ్రింక్స్ను దూరం పెట్టడం.. పోషకాహారం, వారానికి కనీసం 135 నిమిషాల వ్యాయామం దీనికి పరిష్కారాలని వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గడంతోపాటు గుడ్డు, చేపల్ని ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు.
News March 4, 2025
రజినీపై విచారణ.. అనుమతి కోసం గవర్నర్కు లేఖ

AP: మాజీ మంత్రి విడుదల రజినీపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. ఐపీఎస్ జాషువాతో కలిసి స్టోన్క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. విచారణకు అనుమతి కోసం గవర్నర్కు లేఖ రాసింది. గ్రీన్ సిగ్నల్ రాగానే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం కేసు నమోదు చేయనున్నారు.
News March 4, 2025
ట్రంప్ టారిఫ్ నిబంధనలు.. స్టాక్ మార్కెట్లలో కలకలం

మెక్సికో, కెనడాపై తాము విధించిన సుంకాల్లో ఎటువంటి మార్పూ ఉండదని, నేటి నుంచి అమల్లోకి వస్తాయని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదుపులకు లోనయ్యాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఇక భారత్లో నిఫ్టీ ఒకశాతం తక్కువగా మొదలయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్ల ప్రభావం ఎలా ఉండనుందన్న కోణంలో మదుపర్లు ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది.