News May 18, 2024

ట్వీట్ డిలీట్ చేసిన నాగబాబు.. నెటిజన్ల సెటైర్లు

image

ఇటీవల నాగబాబు చేసిన <<13269030>>ట్వీట్<<>> మెగా ఫ్యాన్స్‌-అల్లు ఆర్మీ మధ్య చిచ్చుపెట్టింది. ఈ క్రమంలో తొలుత అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిన ఆయన.. ఇవాళ ఆ ట్వీట్‌ను తొలగించారు. దీంతో అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అల్లు అర్జున్ తన ఫ్రెండ్స్‌కు సపోర్ట్ చేస్తే తప్పేంటని ఆయన ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి తన తమ్ముడు పవన్‌తోపాటు బీజేపీ నేతలకూ సపోర్ట్ చేశారని గుర్తు చేస్తున్నారు.

Similar News

News January 8, 2026

ఏంటి తమ్ముడూ ఈ ఆట.. ఇంకా పెంచుతావా: అశ్విన్

image

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గత కొన్ని నెలలుగా <<18788014>>సంచలన ప్రదర్శన<<>> చేస్తున్నారు. దీనిపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించారు. గత 30 రోజుల్లో దేశీయ, U-19 క్రికెట్‌లో వైభవ్ సాధించిన 171, 190, 108*, 127 వంటి భారీ స్కోర్లను Xలో షేర్ చేశారు. “ఏంటి తమ్ముడూ ఈ ఆట? ఇంకా పెంచుతావా?” అంటూ తమిళంలో కామెంట్స్ చేశారు. ఇంత చిన్న వయసులో ఇంతటి భారీ స్కోర్లు చేయడం అద్భుతమని కొనియాడారు.

News January 8, 2026

జనవరి 8: చరిత్రలో ఈరోజు

image

* 1642: ప్రముఖ భౌగోళిక శాస్త్రజ్ఞుడు గెలీలియో మరణం. * 1942: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జననం * 1962: లియోనార్డో డావిన్సీ వేసిన ‘మోనాలిసా’ పెయింటింగ్‌ను USలో తొలిసారి ప్రదర్శించారు. * 1975: మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ పుట్టినరోజు * 1983: హీరో తరుణ్ బర్త్‌డే (ఫొటోలో) * 1987: IND మాజీ క్రికెటర్ నానా జోషి మరణం

News January 8, 2026

కేరళలో ఫేక్ డిగ్రీ రాకెట్.. ఆస్ట్రేలియాలో దుమారం!

image

కేరళలో బయటపడిన ఫేక్ డిగ్రీ రాకెట్ ఆస్ట్రేలియాలో దుమారం రేపుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో వస్తున్న విదేశీ విద్యార్థులను ప్రభుత్వం అడ్డుకోవడం లేదని ఆసీస్ సెనేటర్లు మండిపడుతున్నారు. వాటితోనే ఇక్కడ చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా ఫేక్ డిగ్రీలు అమ్ముతున్న 11 మందిని ఇటీవల కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 10 లక్షల మందికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.