News December 30, 2024

అప్పుడే క్యాబినెట్‌లోకి నాగబాబు: పవన్

image

AP: ముందు ఎమ్మెల్సీ అయ్యాకే క్యాబినెట్‌లోకి నాగబాబు వస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆయన పార్టీలో చేసిన త్యాగానికి రాజ్యసభ ఇద్దామని అనుకున్నా కుదర్లేదని తెలిపారు. తమ పార్టీ మంత్రుల ఎంపికలో కులం చూసి కాకుండా పనితీరును ప్రామాణికంగా తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల నుంచి 15 రోజుల చొప్పున జిల్లాల్లో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.

Similar News

News February 5, 2025

IBPS పీవో స్కోర్ కార్డులు విడుదల

image

IBPS పీవో మెయిన్స్ స్కోర్ కార్డులు వచ్చేశాయి. గతేడాది NOVలో ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల ఫలితాలను జనవరి 31న రిలీజ్ చేయగా, తాజాగా స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచారు. <>ibps.in<<>> నుంచి మెయిన్స్ స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్వాలిఫై అయిన వారు ఫిబ్రవరి 11న నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్, కాల్ లెటర్స్ తీసుకెళ్లాలి.

News February 5, 2025

మద్యం అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు

image

AP: రాష్ట్రంలో మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన విక్రయాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దీనికి నేతృత్వం వహించనున్నారు. SITకు అవసరమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.

News February 5, 2025

భారతీయులకు సంకెళ్లు వేసి తెచ్చారా?.. నిజమిదే!

image

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ట్రంప్ ప్రభుత్వం యుద్ధ విమానంలో ఇండియాకు పంపిన విషయం తెలిసిందే. వీరికి విమానంలో సంకెళ్లు వేసి తీసుకొచ్చారన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో నిజం లేదు. అవి గ్వాటెమాలా, ఈక్వెడార్, కొలంబియా దేశాలకు చెందిన అక్రమ వలసదారులవి. ఈ విషయం తెలియక కాంగ్రెస్.. భారతీయులను అమెరికా నేరస్థులుగా పంపడం అవమానకరమని, చూడలేకపోతున్నామని వ్యాఖ్యానించింది.

error: Content is protected !!