News August 24, 2024
N కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన నాగార్జున

ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేయడంపై అక్కినేని నాగార్జున స్పందించారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చేశారన్నారు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఇది పట్టా భూమి అని ఆయన తెలిపారు. చెరువులో ఒక అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని, ప్రైవేట్ ల్యాండ్‌లోనే నిర్మించినట్లు స్పష్టం చేశారు. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.
Similar News
News January 24, 2026
ESIC రాంచీలో 82 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 24, 2026
‘సింకింగ్ ఫండ్’.. అప్పుల బాధ ఉండదిక!

పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు క్రెడిట్ కార్డులు, చేబదుళ్లపై ఆధారపడకుండా ఉండాలంటే ‘సింకింగ్ ఫండ్’ ఉత్తమ మార్గం. ఏడాదికోసారి వచ్చే బీమా ప్రీమియంలు, పండుగ ఖర్చులు లేదా పిల్లల ఫీజుల కోసం ముందే నెలకు కొంత చొప్పున పక్కన పెట్టడమే ఈ ఫండ్ లక్ష్యం. అప్పు తీసుకుని వడ్డీ కట్టే బదులు మనమే వాయిదాల్లో డబ్బు దాచుకుంటే రివర్స్‌లో మనకే బ్యాంక్ నుంచి వడ్డీ వస్తుంది. RD లేదా లిక్విడ్ ఫండ్స్ వంటివి దీనికి బెస్ట్.
News January 24, 2026
పేర్ని నాని – అనగాని మధ్య డైలాగ్ వార్

AP: మంత్రి అనగాని, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ‘సంస్కారహీనుడు, మతిస్తిమితం లేని మంత్రి రెవెన్యూ శాఖకు ఉండటం ప్రజల కర్మ. ఆయన అడిగిన రూ.25 కోట్లు జగన్ ఇచ్చుంటే ఇవాళ నా పక్కన ఉండేవారు’ అని పేర్ని నాని విమర్శించారు. అటు ‘తాడేపల్లి ప్యాలెస్ బయట తిరిగే డ్యాష్‌లు ఇంకా పిచ్చి మాటలు మానుకోలేదు. నా రేటేంటో వాడు చెప్పేది ఏంటి? వాడి బతుకేంటో నాకు తెలుసు’ అని అనగాని తీవ్రంగా స్పందించారు.


