News October 2, 2024
సురేఖ ఆరోపణలపై స్పందించిన నాగార్జున

చై-సామ్ విడాకుల్లో తన ప్రమేయం ఉందన్న తెలంగాణ మంత్రి <<14254371>>సురేఖ<<>> ఆరోపణలను నాగార్జున ఖండించారు. ప్రత్యర్థులను విమర్శించేందుకు సినిమా వారిని వాడుకోవద్దని కోరారు. ‘సాటి మనుషుల వ్యక్తిగత విషయాలు గౌరవించండి. బాధ్యత గల పదవిలోని మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలసిందిగా కోరుతున్నాను’ అని నాగార్జున ట్వీట్ చేశారు.
Similar News
News November 15, 2025
పేదల తరఫున గొంతెత్తుతూనే ఉంటాం: RJD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ ఫలితాలపై తొలిసారి స్పందించింది. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అని, దానికి అంతం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొంది. ఓటమితో విచారం.. గెలుపుతో అహంకారం ఉండబోదని తెలిపింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 25 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే.
News November 15, 2025
రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News November 15, 2025
మూవీ ముచ్చట్లు

* Globetrotter ఈవెంట్లో SSMB29 టైటిల్ వీడియో ప్లే అయ్యాక ఆన్లైన్లో రిలీజ్ చేస్తాం: రాజమౌళి
* రజినీకాంత్ హీరోగా తాను నిర్మిస్తున్న ‘తలైవర్ 173’ మూవీ నుంచి డైరెక్టర్ సి.సుందర్ తప్పుకున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్
* దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చిన ‘కాంత’ చిత్రానికి తొలిరోజు రూ.10.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
* రోజుకు 8 గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుంది: దీపికా పదుకొణె


