News December 9, 2024

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 69 ఏళ్లు పూర్తి

image

కోట్లాది తెలుగు ప్రజలకు జీవనాధారంగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు నేటితో 69 ఏళ్లు పూర్తి అయ్యాయి. 1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధాని నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి జలాశయాల్లో ఒకటైన దీని విస్తీర్ణం 110చ.మైళ్లు కాగా, గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు. ప్రాజెక్ట్ కుడి కాలువను జవహర్ కాలువగా, ఎడమ దాన్ని లాల్ బహదూర్ కాలువగా పిలుస్తారు.

Similar News

News December 4, 2025

VKB: జిల్లాలో 26 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

తాండూర్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇందులో కరన్ కోట్, రాంపూర్ తండా, వీరారెడ్డిపల్లి, బిజ్వార్, చిట్టి ఘనపూర్, లక్ష్మీనారాయణపూర్, గంగసాగర్, దేవులతాండ, కిష్టాపూర్, రుద్రారం, బుగ్గాపూర్ పలు గ్రామాలు ఉన్నాయి. ఏకగ్రీవమైన పంచాయతీలు ఈ నెలాఖరు వరకు అధికారికంగా ప్రకటించనున్నారు.

News December 4, 2025

పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న రాజభవనం గురించి తెలుసా?

image

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఢిల్లీలోని చారిత్రక ‘హైదరాబాద్ హౌస్’ ఆతిథ్యం ఇవ్వనుంది. ఒకప్పుడు ప్రపంచ ధనవంతుడిగా పేరొందిన చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఈ రాజ భవనాన్ని కట్టించారు. సీతాకోకచిలుక ఆకారంలో నిర్మించేందుకు 2L పౌండ్లు(ఇప్పటి లెక్కల్లో ₹170 కోట్లు) ఖర్చు చేశారు. 8.6 ఎకరాల ప్యాలెస్‌లో 36 గదులు, మెట్ల మార్గాలు, ఫౌంటైన్లు వంటివెన్నో ఉన్నాయి. ఎంతో మంది దేశాధినేతలు ఇక్కడ ఆతిథ్యం స్వీకరించారు.

News December 4, 2025

ఏడాదిలో సరికొత్త టోల్ వ్యవస్థ: గడ్కరీ

image

ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థ ఏడాదిలోపే కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను అమలు చేస్తామని చెప్పారు. దీనివల్ల టోల్ పేరుతో NHలపై ఎక్కడా ఆగకుండా ప్రయాణించవచ్చన్నారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో అమలవుతోన్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.10 లక్షల కోట్లతో 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని లోక్‌సభలో తెలిపారు.