News July 13, 2024

డెడ్ స్టోరేజీ దిగువకు నాగార్జున సాగర్

image

తెలుగు రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ దిగువకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 503 అడుగులకు పడిపోయింది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడమే ఇందుకు కారణం. కాగా కర్ణాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్ త్వరలోనే నిండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మట్టి నుంచి దిగువకు నీరు విడుదల చేస్తే శ్రీశైలంతోపాటు సాగర్ కూడా నిండనుంది.

Similar News

News October 16, 2025

IPS ఆఫీసర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు

image

పంజాబ్‌లోని రోపార్ రేంజ్ DIG, 2009 బ్యాచ్ IPS హర్‌చరణ్ సింగ్ భుల్లర్‌ను CBI అరెస్ట్ చేసింది. ₹8లక్షలు లంచం తీసుకుంటూ ఆయన అధికారులకు పట్టుబడ్డారు. హర్‌చరణ్ ఇల్లు, ఆఫీసులో సోదాలు చేసి ₹5Cr నగదు, 1.5kgs జువెలరీ, 22 లగ్జరీ వాచ్‌లు, ఆడి, మెర్సిడెస్ కార్లు, గన్స్&పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు మధ్యవర్తినీ అరెస్ట్ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రేపు వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.

News October 16, 2025

తాలిబన్లు మనకు శత్రువులా?

image

<<18023858>>అఫ్గానిస్థాన్‌<<>>లోని తాలిబన్లు నిరంతరం యుద్ధాల్లో ఉండటంతో వారు మనకూ శత్రువులేనా అని పలువురు అనుకుంటారు. మనకు, వారికి ఇప్పటివరకు విభేదాలు/శత్రుత్వం రాలేదు. 1999లో పాక్ లష్కరే తోయిబా ఉగ్రవాదులు నేపాల్-ఢిల్లీ IC 814 విమానాన్ని హైజాక్ చేశారు. దాన్ని అఫ్గాన్‌లో ల్యాండ్ చేశారు. తాలిబన్లకు చెడ్డపేరు వచ్చేందుకు ఆ ప్లాన్ చేశారు. కానీ తాలిబన్లు ఆ విమానానికి రక్షణగా ఉండటంతో పాటు ఎవరికీ అపాయం కలగకుండా చూశారు.

News October 16, 2025

‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోగా దేవిశ్రీప్రసాద్?

image

‘బలగం’తో డైరెక్టర్‌గా మారిన కమెడియన్ వేణు ‘ఎల్లమ్మ’ పేరుతో ఓ మూవీ తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటించనున్నట్లు తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అంతకుముందు ఈ ప్రాజెక్టు నాని నుంచి నితిన్‌కు, తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ వద్దకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు DSP పేరు వినిపించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.