News October 4, 2024
కొండా సురేఖపై నాగార్జున రూ.100 కోట్ల దావా!

TG: మంత్రి కొండా సురేఖపై రూ.100 కోట్ల దావా వేసే ప్రక్రియలో ఉన్నట్లు హీరో నాగార్జున తెలిపారు. ‘వివాదం తర్వాత సమంతకు ఆమె క్షమాపణలు చెప్పారు. నాకు, నా కుటుంబానికి మాత్రం అపాలజీ చెప్పలేదు. అందుకే ఇప్పటికే సురేఖపై క్రిమినల్, పరువు నష్టం కేసు వేశాం. క్షమాపణ చెప్పినా కేసు వెనక్కి తీసుకోం. మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. వివాదంలో ఇండస్ట్రీ మొత్తం మాకు అండగా నిలిచింది’ అని ఆయన TimesNowతో చెప్పారు.
Similar News
News February 1, 2026
మాఘ పౌర్ణమి: అద్భుత ఫలితాలనిచ్చే పుణ్యకార్యాలు

నేడు చేసే చిన్న సత్కార్యం కూడా కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. ఈరోజు గంగమ్మను, నారాయణుడిని స్మరిస్తూ పితృ తర్పణాలు వదలడం శుభప్రదం. దానధర్మాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నువ్వులు, రేగి పండ్లు, అన్నదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే, సాయంత్రం వేళ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కష్టాలు తొలగి సంపదలు కలుగుతాయి. ఈ పవిత్ర దినాన చేసే జప, హోమాలు సర్వ పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తాయి.
News February 1, 2026
ప్రెగ్నెన్సీలో ఎంతసేపు పడుకోవాలంటే?

ప్రెగ్నెన్సీలో తల్లికి 7-9 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. అలాగే పడుకోవడానికి వీలుగా పిల్లో వాడాలని సూచిస్తున్నారు. మంచి నిద్ర కోసం మసాలాలున్న ఆహారాలు, కెఫీన్ వంటివి తగ్గించాలి. ఎలక్ట్రానిక్ పరికరాలను నిద్రకు ముందు చూడకపోవడమే మంచిది. కనీసం ఒక గంట ముందు స్క్రీన్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల గర్భాశయానికి తగినంత రక్తం, పోషకాలు అందుతాయని చెబుతున్నారు.
News February 1, 2026
కేరళ టీచర్‌కు 161 ఏళ్ల జైలు శిక్ష.. కారణమిదే!

ఆటిజం బాలుడి(10)పై లైంగిక దాడి కేసులో కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 161 ఏళ్ల జైలు శిక్షతోపాటు ₹87 వేలు జరిమానా విధించింది. 2019 జులైలో తిరువనంతపురంలో ప్రత్యేక పాఠశాలలో బాలుడిని పేరెంట్స్ చేర్చారు. అయితే అతడిలో మార్పులను, ఒంటిపై గాయాలను గమనించారు. టీచర్ సంతోష్ కుమార్(56) తనపై లైంగిక దాడి చేసినట్లు బాలుడు రైటింగ్/డ్రాయింగ్ ద్వారా చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


