News September 20, 2025
నవంబర్ 14న నాగార్జున ‘శివ’ రీరిలీజ్

అక్కినేని నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘శివ’ సినిమా రీరిలీజ్ తేదీ ఖరారైంది. ఇండియన్ సినిమాను షేక్ చేసిన ‘శివ’ నవంబర్ 14న రీరిలీజ్ అవుతుందని నాగ్ ట్వీట్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. 4K క్వాలిటీ & డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. అమల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు.
Similar News
News September 20, 2025
హెయిర్ క్రింపింగ్ ఎలా చేయాలంటే?

కొందరు అమ్మాయిలకు జుట్టు పలుచగా ఉంటుంది. ఒత్తుగా కనిపించాలని పార్లర్‌కి వెళ్లి హెయిర్ క్రింపింగ్ చేయించుకుంటారు. అయితే కొన్ని టిప్స్ పాటించి ఇంట్లోనే దీన్ని చేసుకోవచ్చు. ముందు జుట్టుకు హెయిర్ ప్రొటక్షన్‌ను అప్లై చేసి చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. జుట్టును లేయర్స్‌గా తీసుకుంటూ హెయిర్ క్రింపర్‌తో గట్టిగా ప్రెస్ చేయాలి. జుట్టు మొత్తం ఇలా చేశాక హెయిర్ స్ప్రే చేస్తే చాలు జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది.
News September 20, 2025
రేపు పాక్‌తో మ్యాచ్.. సూర్య ఏమన్నారంటే?

ఆసియా కప్: రేపు PAKతో జరిగే మ్యాచ్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించట్లేదని IND కెప్టెన్ సూర్య తెలిపారు. ‘ప్రతీ మ్యాచ్ ఒక కొత్త ఛాలెంజ్. రేపు సండే కావడంతో చాలా మంది చూస్తారు. గ్రౌండ్‌లోకి దిగి వారిని ఎంటర్టైన్ చేయాలి. సేమ్ ఇంటెన్సిటీ, ఎనర్జీతో ఆడతాం. బెస్ట్ ఇస్తాం’ అని అన్నారు. ఇతరులకు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చేందుకే ఒమన్‌తో మ్యాచులో తాను బ్యాటింగ్ చేయలేదన్నారు. తనకు టీమ్ గెలిస్తే చాలని చెప్పారు.
News September 20, 2025
ఆశ్వయుజ మాసంలో వెల్లివిరియనున్న ఆధ్యాత్మికత

ఆశ్వయుజ మాసం పండుగలు, ఉత్సవాలతో ఆధ్యాత్మికతను నింపనుంది. సెప్టెంబర్ 22 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీశైలం క్షేత్రంలోనూ ఉత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్ 21న బతుకమ్మ సంబురాలు తెలంగాణలో ప్రారంభమై దుర్గాష్టమి వరకు కోలాహలంగా కొనసాగుతాయి. అదే సమయంలో సెప్టెంబర్ 24 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తులను అలరిస్తాయి. ఈ ఉత్సవాల పరంపర దీపావళితో ముగుస్తుంది.