News August 29, 2024
నాగార్జున స్టైలిష్ లుక్

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో కింగ్ నాగార్జున నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నాగ్ బర్త్డే సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. అందులో నాగ్ స్టైలిష్గా కనిపించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆయన ‘సైమన్’ అనే పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
Similar News
News January 18, 2026
రథసప్తమి వేడుకలకు పటిష్ఠ బందోబస్తు: ఐజీ

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోందని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ, డీఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, బారికేడ్లు, వాహనాల పార్కింగ్ మరియు రూట్ మ్యాప్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News January 18, 2026
HEADLINES

* వందేభారత్ స్లీపర్ ప్రారంభించిన PM మోదీ
* బెంగాల్లో బీజేపీ రావాలి: PM మోదీ
* ఇరిగేషన్, ఎడ్యుకేషన్కే తొలి ప్రాధాన్యం: TG CM రేవంత్
* ప్రధాని అండతో అభివృద్ధిలో ముందుకెళ్తాం: AP CM CBN
* AP కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమకు శంకుస్థాపన
* రేవంత్ తుగ్లక్లా వ్యవహరిస్తున్నారు: KTR
* తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు
* JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల
News January 18, 2026
భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారో తెలుసా?

ప్రపంచంలోనే ఎక్కువ సవరణలు జరిగింది భారత రాజ్యాంగంలోనే. 1949, NOV 26న రాజ్యాంగ సభ ఆమోదం పొంది 1950, JAN 26న అమలులోకి వచ్చినప్పటి నుంచి నేటివరకు 106సార్లు సవరణలు చేశారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించడాన్ని తప్పనిసరి చేస్తూ 2023 SEPలో చివరిగా సవరించారు. జనాభా లెక్కలు, నియోజకవర్గాల డీలిమిటేషన్స్ పూర్తైన తర్వాత రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి.


