News November 22, 2024
సురేఖపై నాగార్జున దావా.. ఈనెల 28న తీర్పు

TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. సురేఖ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్పై గురువారం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగార్జున తరఫు లాయర్ డిమాండ్ చేశారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన జడ్జి, ఈనెల 28న తీర్పును వెల్లడించనున్నట్లు తెలిపారు.
Similar News
News October 15, 2025
రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశం

TG: CM రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం రేపు మ.3 గం.కు సమావేశం కానుంది. ప్రధానంగా BC రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, మెట్రో రైలు ప్రాజెక్ట్, ధాన్యం సేకరణ, మూసీ ప్రాజెక్ట్, టీ-ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ అంశాలు చర్చకు రానున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనుల అంశం, సమ్మక్క-సారలమ్మ ఆనకట్ట, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం వంటి అంశాలూ చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
News October 15, 2025
ఇతిహాసాలు క్విజ్ – 36

1. దశరథుడి తల్లి పేరేంటి?
2. పాండవులు అజ్ఞాతవాసం ఎన్నేళ్లు చేశారు?
3. విష్ణువు ధనస్సు పేరేంటి?
4. తెలంగాణలోని ‘భద్రాచలం’ ఆలయం ఏ నది ఒడ్డున ఉంది?
5. శుక అంటే ఏ పక్షి?
* సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 15, 2025
L.C.A-625 మిరప రకం ప్రత్యేకలు ఇవే

ఎండు మిరప కింద సాగుకు ఈ రకం అనువైనది. ఈ రకం మొక్కలు ఎత్తైన కొమ్మలతో బలంగా పెరుగుతాయి. కణుపులు దగ్గరగా ఉండి కాయలు ఎక్కువగా కాస్తాయి. కాయలు సన్నగా, మధ్యస్థ పొడవు (8-10 సెం.మీ.) ఉండి.. తేజ రకాన్ని పోలి ఉంటాయి. పచ్చికాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సూటి రకాల్లో కెల్లా అధిక ఘాటుతో పాటు ఆకర్షణీయమైన ఎరుపు రంగులో ఉంటాయి. తాలు కాయలు చాలా తక్కువగా ఉంటాయి. కాయకుళ్లు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది.