News March 17, 2024

నాగర్‌కర్నూల్: ‘విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుంటే చర్యలు’

image

పదో తరగతి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు, ఇతర కారణాలతో యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని డీఈవో గోవిందరాజులు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది కాపీయింగ్ ప్రోత్సహించినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో హెచ్చరించారు.

Similar News

News April 3, 2025

మహబూబ్‌నగర్: ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం: కలెక్టర్ 

image

బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కోరారు. ఏప్రిల్ 5వ తేదీన జగ్జీవన్ రామ్, 14వ తేదీన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత సంఘాల ప్రతినిధులు అధికారులతో సమావేశం అయ్యారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు.

News April 3, 2025

MBNR: ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించాలని వినతి

image

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీనివాస్‌ను బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ బుధవారం కోరారు. అలాగే పాలమూరు విశ్వవిద్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే అధ్యయన కేంద్రాన్ని కూడా నెలకొల్పాలన్నారు. ఈ అధ్యయన కేంద్రం ద్వారా జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగించడానికి వీలవుతుందని వెల్లడించారు.

News April 2, 2025

MBNR: నేటి నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో పోలీస్ యాక్ట్ 

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ 1961 అమలులో ఉంటుందని ఎస్పీ జానకి ధరావత్ వెల్లడించారు. పోలీసుల అనుమతులు లేకుండా ఎటువంటి మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించకూడదన్నారు. నిషేధిత కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు వాడకూడదన్నారు. డీజేలు లౌడ్ స్పీకర్లను కూడా పూర్తిస్థాయిలో నిషేధించామన్నారు.

error: Content is protected !!