News February 25, 2025
రాజీనామా చేసిన నహీద్.. త్వరలో కొత్త పార్టీ!

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉన్న నహీద్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను చీఫ్ అడ్వైజర్ మహమూద్ యూనస్‌కు అందజేశారు. నహీద్ సొంత పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఢాకా యూనివర్సిటీకి చెందిన ఇతడు షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలకపాత్ర పోషించారు. నహీద్ నాయకత్వంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు.
Similar News
News February 25, 2025
శివరాత్రికి స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయా?

మహా శివరాత్రి పర్వదినమైన బుధవారం రోజు భారత స్టాక్‌మార్కెట్లు పనిచేయవు. FEB 26న ట్రేడింగ్ యాక్టివిటీస్ కొనసాగవని, సెటిల్మెంట్లు ఉండవని NSE, BSE ప్రకటించాయి. కమోడిటీ మార్కెట్‌కు మార్నింగ్ సెషన్ సెలవు ఉంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ట్రేడింగ్ మొదలవుతుంది. 2025లో స్టాక్ మార్కెట్లకు మొత్తం 18 రోజులు సెలవులు ఉన్నాయి. శివరాత్రి తర్వాత మార్చి 14న హోలి, 31న రంజాన్ సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.
News February 25, 2025
ఎల్లుండి SLBCకి BRS నేతలు: హరీశ్‌రావు

TG: SLBC ఘటన చాలా దురదృష్టకరమని, చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఎల్లుండి తమ పార్టీ నేతలు SLBC సందర్శనకు వెళ్తారని, పోలీసులు తమను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అటు ఈ ఘటనపై జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి KTR ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఘటనపై విచారణ చేపట్టాలని సూచించారు.
News February 25, 2025
అసెంబ్లీలో జల్సా మూవీ గురించి చర్చ

AP అసెంబ్లీలో జల్సా మూవీ చర్చకు వచ్చింది. విద్యార్థులతో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టాలని స్పీకర్ అయ్యన్న పవన్‌ను కోరారు. ‘ఏది అడిగినా డబ్బుతో ముడిపడి ఉంది. జల్సా మూవీలో చొక్కా(బ్రహ్మానందం) జేబులో డబ్బులు ఉంటాయని ఫ్రెండ్స్‌కు హీరో చెబుతుంటాడు. కానీ అక్కడ ఉండవు. చివరకు అతనే బయటకొచ్చి, ఏముంది చొక్క, బొక్క తప్ప అని అంటాడు. ఇప్పుడు AP పరిస్థితి అలానే ఉంది. YCP ఖజానాను లూటీ చేసింది’ అని ఫైరయ్యారు.