News June 4, 2024

53వేల ఓట్ల ఆధిక్యంలో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి

image

నల్గొండలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఆ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 53వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వరుసగా మూడు సార్లు గెలుపొందింది.

Similar News

News January 22, 2026

‘భగవంత్ కేసరి’ బిగ్ హిట్ కావాల్సింది: అనిల్

image

తన కెరీర్‌లో కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్‌లలో బాలకృష్ణతో చేసిన ‘భగవంత్ కేసరి’ ఒకటని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ‘ఈ మూవీ భారీ విజయం సాధించాల్సింది. విడుదలైన సమయంలో చంద్రబాబు జైలులో ఉండటంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. సాధారణ ప్రేక్షకులు మూవీని హిట్ చేశారు. పరిస్థితులు బాగుంటే మరింతగా హిట్ అయ్యేది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ మూవీకి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు దక్కింది.

News January 22, 2026

సిజేరియన్ తర్వాత ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

ప్రస్తుతం సిజేరియన్ డెలివరీలు సర్వసాధారణమైపోయాయి. దీన్నుంచి కోలుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సిజేరియన్ తర్వాత తల్లులు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకుంటారు. రెండు వారాల పాటు ఎక్కువ బరువున్న వస్తువులను ఎత్తకూడదు. పాలిచ్చేటపుడు ముందుకు వంగకుండా నిటారుగా కూర్చోవాలి. పోషకాలు లభించే పదార్థాలు తీసుకుంటే సిజేరియన్ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని సలహా ఇస్తున్నారు.

News January 22, 2026

సహజీవనంలో మహిళకు భార్య హోదా ఇవ్వాలి: హైకోర్ట్

image

లివింగ్ రిలేషన్‌లో ఉండే మహిళలకు గాంధర్వ వివాహం/ప్రేమపెళ్లి కింద ‘భార్య’ హోదా కల్పించాలని మద్రాస్ హైకోర్ట్ అభిప్రాయపడింది. పెళ్లిపేరుతో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ జస్టిస్ శ్రీమతి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రాచీన భారతదేశంలోని 8 వివాహాల్లో గాంధర్వ వివాహం ఒకటి. సహజీవనాన్ని ఈ వివాహంగా గుర్తించొచ్చు. ఈ విషయాల్లో BNSలోని Sec68 మహిళలకు రక్షణ కల్పిస్తుంది’ అని తెలిపారు.