News March 17, 2024

మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..?

image

ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా సేవలందించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలె ఆయన బీజేపీలో చేరారు.  ఆదివారం ఆయన ప్రజాగళం సభలో ప్రధాని మోదీ, CBN, PKతో కలిసి వేదికను పంచుకున్నారు. దీంతో ఆయన రానున్న ఎన్నికల్లో రాజంపేట MP అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్త గట్టిగా వినిపిస్తోంది. 

Similar News

News October 28, 2025

చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు సెలవు లేదు: DEO

image

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బుధవారం నుంచి యథావిధిగా పనిచేస్తాయని DEO వరలక్ష్మి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవు ప్రకటించడం జరిగిందని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని ఆమె తెలిపారు.

News October 28, 2025

నిండ్ర: బస్సును ఢీకొన్న లారీ

image

పుత్తూరు – చెన్నై జాతీయ రహదారిలో నిండ్ర మండలం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. నిండ్ర మండలంలోని కొప్పేడు వద్ద సత్యవేడు ఆర్టీసీ డిపో బస్సును లారీ ఢీకొంది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయినట్లు సమాచారం. అలాగే ఇవాళ ఉదయం పుంగనూరు-చెన్నై హైవేపై రెండు బస్సులు ఢీకొన్న విషయం తెలిసిందే.

News October 28, 2025

కుప్పంకు భారీ పరిశ్రమలు… 22 వేలు మందికి ఉద్యోగాలు…!

image

సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం పారిశ్రామిక వాడగా మారనుంది. నేడు వర్చువల్ గా నిర్వహించాల్సిన శంకుస్థాపన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. AELAP, ACE, E-ROYCE, ఆదిత్య బిర్లా గ్రూప్స్, ఎస్వీఎఫ్ సోయా కంపెనీలతో పాటుగా మదర్ డెయిరీ, శ్రీజ డెయిరీ 2027 నాటికి పూర్తి అవుతాయి. కంపెనీలు అందుబాటులోకి రాగానే ప్రత్యక్షంగా 22 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని సమాచారం.