News September 10, 2024

కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు: సీఎం రేవంత్

image

TG: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర మరవలేనిదని కొనియాడారు. ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. భూముల ఆక్రమణలు అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె స్ఫూర్తి అని చెప్పారు. ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 14, 2025

హైకోర్టు స్టేపై సుప్రీంలో పిటిషన్.. నేడే విచారణ!

image

TG: BC రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు స్టేపై 50పేజీల సమగ్ర సమాచారంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసును రిఫరెన్స్‌గా చూపింది. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావించింది. 50% రిజర్వేషన్ల క్యాప్ దాటొద్దని చెప్పినా అది విద్య, ఉపాధి రంగాలకే పరిమితమని గుర్తు చేసింది. ఈ పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చే అవకాశముంది.

News October 14, 2025

పశువులు, గొర్రెల, మేకల ఎరువుతో లాభాలు

image

ఒక టన్ను పశువుల ఎరువును పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19 KGల పొటాష్ పొలానికి అందుతాయి. గొర్రెలు, మేకల ఎరువు టన్ను వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్ భూమికి అందుతుంది. పొలంలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతోనూ భూసారం పెరుగుతుంది.

News October 14, 2025

APPLY NOW: ఐఐటీ ఇండోర్‌లో 16 పోస్టులు

image

ఐఐటీ ఇండోర్ 16 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ, ఏదైనా ఐఐటీ నుండి డిజైనింగ్ డిప్లొమా/ ఆర్ట్స్/అప్లైడ్ ఆర్ట్స్‌ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iiti.ac.in/