News February 10, 2025
విజయవాడ వెస్ట్ బైపాస్‌కు రంగా పేరు పెట్టండి: షర్మిల

AP:విజయవాడ వెస్ట్ బైపాస్‌కు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని CM చంద్రబాబును APCC చీఫ్ షర్మిల కోరారు. ‘కాజా టోల్ గేట్ నుంచి చిన్న అవుటుపల్లి వరకు 47.8KM దూరం గల బైపాస్ పూర్తి కావొచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ బైపాస్‌తో ట్రాఫిక్ కష్టాలు కొంత తగ్గుతాయి. ప్రజలకు రంగా చేసిన సేవ అనిర్వచనీయం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం వాదించి, పేదల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన రంగా పేరు పెట్టండి’ అని ఆమె లేఖ రాశారు.
Similar News
News March 27, 2026
కురుల ఆరోగ్యాన్ని పెంచే తమలపాకు

తమలపాకులు కురుల ఆరోగ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కురులను దృఢంగా చేసి చుండ్రును నియంత్రిస్తాయి. ☛ మందార పూలు, తమలపాకులు, కరివేపాకు, తులసి ఆకులను పేస్ట్ చేసి 2స్పూన్ల నూనె కలిపి తలకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. ☛ తమలపాకు పేస్టుకు కాస్త కొబ్బరినూనె, ఆముదం కలిపి తలకు పెట్టుకొని అరగంట తర్వాత కడిగేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
News March 27, 2026
నేడే శ్రీరామనవమి..శుభ ముహూర్తం ఎప్పుడంటే

శ్రీరామనవమి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఇవాళ ఉదయం 11.06 నుంచి మధ్యాహ్నం 1.31 వరకు కోదండరాముడి పూజకు మంచి సమయమని పండితులు చెబుతున్నారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా ఇదే సమయంలో జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఇంట్లో స్వామివారికి నివేదన సమర్పించి, ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయాలని పండితులు సూచిస్తున్నారు.
News March 27, 2026
అధిక పాలిచ్చే పశువుకు ఉండే మరికొన్ని లక్షణాలు

పాడి పశువు నుంచి పాలు పిండిన తర్వాత పొదుగు ఒక రబ్బరు బుడగ గాలి తీసివేస్తే ఎలా అవుతుందో అలా అయిపోవాలి. అలా అవ్వని పొదుగును కండపొదుగు అంటారు. ఇది అధిక పాల దిగుబడికి పనికిరాదు. అంతేకాక పొదుగు మీద కనపడే రక్తనాళాలను గమనించాలి. వీటిని పాల సిరలు అంటారు. ఇవి పెద్దవిగా, ఎక్కువ పొడవుగా ఉండాలి. అలా ఉంటే పొదుగుకు అధిక రక్త సరఫరా జరిగి, పాల దిగుబడి పెరుగుతుంది. పొదుగు మీద చర్మం కూడా పలుచగా ఉండాలి.


