News June 21, 2024
ఏపీలో మరో 2 పథకాల పేర్లు మార్పు
AP: రాష్ట్రంలో మరో రెండు పథకాల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల పేర్లను ‘బాల సంజీవని’గా మార్చింది. ఈ స్కీమ్ కింద గర్భిణీలు, బాలింతలకు నెలకు 2 కేజీల రాగి పిండి, కేజీ అటుకులు, 250 గ్రా.బెల్లం, 250 గ్రా.చిక్కీ, ఎండు ఖర్జూరం, 5 లీటర్ల పాలు, 25 గుడ్లు, కేజీ పప్పు, తదితర రేషన్ సరుకులు అందిస్తారు.
Similar News
News February 4, 2025
ఫోర్బ్స్ టాప్-10 దేశాల్లో ఇండియాకు నో ప్లేస్
ఫోర్బ్స్ ప్రకటించిన టాప్-10 శక్తివంతమైన దేశాల జాబితాలో ఇండియాకు చోటు దక్కలేదు. నాయకత్వం, ఆర్థిక ప్రభావం, రాజకీయ శక్తి, బలమైన విదేశీ సంబంధాలు, సైనిక శక్తి ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. ఇందులో అమెరికా, చైనా, రష్యా, యూకే, జర్మనీ, సౌత్ కొరియా, ఫ్రాన్స్, జపాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలకు టాప్-10లో చోటు దక్కింది. భారత్ 12వ స్థానంలో ఉంది.
News February 4, 2025
రూ.3 కోట్లతో గర్ల్‌ఫ్రెండ్‌కు ఇల్లు కట్టించిన దొంగ
షోలాపూర్‌కు చెందిన ఓ దొంగ తన గర్ల్ ఫ్రెండ్‌కు రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. పంచాక్షరి స్వామి(37) మైనర్‌గా ఉన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తున్నాడు. ఇళ్లలో బంగారం దొంగిలించి వాటిని కరిగించి బిస్కెట్లుగా మారుస్తాడు. ఈక్రమంలో నటితో పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. దొంగిలించిన డబ్బుతో కోల్‌కతాలో రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. ఓ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా ఈ విషయం వెల్లడైంది.
News February 4, 2025
వన్డే జట్టులోకి మిస్టరీ స్పిన్నర్
ఇంగ్లండ్‌తో ఈ నెల 6న ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని BCCI సెలక్ట్ చేసింది. 15మందితో జట్టును ఇప్పటికే ప్రకటించగా 16వ ప్లేయర్ యాడ్ అయ్యారు. ఇటీవల ముగిసిన T20 సిరీస్‌లో వరుణ్ 7.66RRతో 14 వికెట్లు తీశారు. ఫామ్‌లో ఉన్న వరుణ్ ఈ సిరీస్‌లో రాణిస్తే CTకి సైతం ఎంపిక చేయాలని BCCI భావిస్తోంది. చక్రవర్తిని CTకి ఎంపిక చేయాలని సీనియర్ ప్లేయర్లు సూచించిన విషయం తెలిసిందే.