News September 23, 2024
ముంబై నటి కేసులో నిందితులుగా ఐపీఎస్ అధికారుల పేర్లు

AP: ముంబై నటి జెత్వానీని వేధించిన కేసులో పోలీసులు ఐదుగురిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఏ1 కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో ఏ2గా పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ3గా కాంతిరాణా, ఏ4గా అప్పటి వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతురావు పేర్లను నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 1, 2025
జూ.పంచాయతీ సెక్రటరీ స్పోర్ట్స్ కోటా జాబితా విడుదల

TG: జూ.పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు గతంలో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 172మంది అభ్యర్థులకు గుడ్‌న్యూస్. 2018లో పరీక్ష జరగ్గా 2019లో ఫలితాలు వచ్చాయి. వీరి ఎంపికను వ్యతిరేకిస్తూ HCలో పిటిషన్ దాఖలు కాగా 2021లో ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇటీవల కోర్టు క్లియరెన్స్ ఇవ్వగా జాబితాను రిలీజ్ చేశారు.<
News November 1, 2025
టీమ్ఇండియా కప్ గెలిస్తే రూ.125కోట్లు!

WWC గెలిస్తే భారత క్రికెట్ జట్టుకు భారీ నజరానా ఇవ్వాలని BCCI భావిస్తున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. గతేడాది T20 WC గెలిచిన పురుషుల జట్టుకు రూ.125కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. మెన్స్ టీంతో సమానంగా మహిళల జట్టుకు కూడా నజరానా అందించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. రేపు ఫైనల్‌లో నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో హర్మన్ సేన పోటీపడనుంది. అటు ICC సుమారు రూ.123CR ప్రైజ్‌మనీ ఇస్తుంది.
News November 1, 2025
‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది’ అంటూ యాడ్!

పాన్ కార్డు, బర్త్, స్టడీ సర్టిఫికెట్స్ పోయాయని కొందరు పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటాం. అయితే అస్సాంలోని ఓ వార్తాపత్రికలో తన డెత్ సర్టిఫికెట్ పోయిందని యాడ్ రావడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. రంజిత్ చక్రవర్తి అనే వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ లంబ్డింగ్ బజార్‌లో పోయిందని ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు దీనిపై స్పందించకపోయినా, ఈ తప్పు ప్రకటన ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది.


