News February 10, 2025
ఎప్పటికీ నీతోనే నమ్రతా: మహేశ్ స్పెషల్ పోస్ట్

టాలీవుడ్ స్టార్ కపుల్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత వివాహం జరిగి నేటికి 20 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మహేశ్ తన సతీమణికి విషెస్ తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘నువ్వు, నేను.. అందమైన 20 వసంతాలు. ఎప్పటికీ నీతోనే నమ్రత’ అని పేర్కొంటూ ఇద్దరూ కలిసున్న ఫొటో షేర్ చేశారు. తెలుగు సంప్రదాయం ప్రకారం 2005లో వీరి వివాహం జరగ్గా.. ఇది తెలిసి లక్షల మంది మహిళా అభిమానులకు హార్ట్ బ్రేక్ అయింది.
Similar News
News March 31, 2026
జూనియర్ కాలేజీలకు సెలవులే సెలవులు

AP:ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఇందులో 2026-27లో APR-MAR వరకు 314 రోజులకు గాను 232 వర్కింగ్ డేస్‌గా చూపింది. ఇక సండే, 2వ శనివారాలు, పబ్లిక్ హాలిడేస్, పండగలకు 82 రోజులు సెలవుగా పేర్కొంది. OCTలో దసరాతో సహా 14 రోజులు, JANలో సంక్రాంతితో కలిపి 13 రోజులు సెలవు ఇస్తారు. వీటికి అదనంగా ఏటా APR24 నుంచి MAY31 వరకు 38 రోజులు సమ్మర్ సెలవులుంటాయి. మొత్తంగా 120 రోజులు సెలవులే.
News March 31, 2026
రోహిత్ శర్మ ₹214 కోట్ల సామ్రాజ్యం

రోహిత్ శర్మ కేవలం గ్రౌండ్‌లోనే కాదు బయట కూడా ‘హిట్ మ్యాన్’లాగే బతుకుతున్నారు. ₹214 కోట్ల నెట్‌వర్త్ ఉన్న ఈ క్రికెటర్ ముంబైలో లగ్జరీ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అహుజా టవర్స్‌లో ఉన్న ఈ ఇంటి నుంచి సీ-వ్యూ అద్భుతంగా ఉంటుంది. మోడ్రన్ ఇంటీరియర్స్, పీస్‌ఫుల్ గార్డెన్, క్లాసీ పూజా ఏరియాతో ఈ ఇల్లు కలల సౌధాన్ని తలపిస్తుంది. క్రికెట్‌తో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఆయన రేంజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి.
News March 31, 2026
BIG ALERT: వడగళ్ల వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల <<19520557>>వర్షాలు<<>> కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉదయం 8.30 గంటలలోపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వానలు పడే ఛాన్స్ ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించింది.


