News December 2, 2024
నందమూరి మోక్షజ్ఞ రెండో సినిమా ఫిక్స్?

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ రెండో సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరితో ఆయన మూవీ తీస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నట్లు టాక్. తన తొలి సినిమా ప్రశాంత్ వర్మతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈ నెల 5న జరుగుతాయని తెలుస్తోంది. జనవరి నుంచి రెగ్యులర్ షూట్ జరుగుతుందని సమాచారం.
Similar News
News October 27, 2025
‘డిజిటల్ అరెస్టుల’పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. వీటిపై నమోదైన FIRలను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల విచారణ బాధ్యతను CBIకి అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం సైబర్ క్రైమ్ నిపుణులు, వసతులు కావాలంటే చెప్పాలని CBIకి సూచించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
News October 27, 2025
సీఎంతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ

AP: రాష్ట్రానికి మొంథా తుఫాను ముప్పు ఉన్న నేపథ్యంలో CM CBNతో PM మోదీ ఫోనులో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం PMOతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేశ్కు CM సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వ గట్లు పటిష్ఠం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు నిర్వహించిన సమీక్షలో మంత్రులు లోకేశ్, అనిత, CS తదితరులు పాల్గొన్నారు.
News October 27, 2025
మొదటి అడుగు సులభం కాదు.. కానీ: ఆనంద్

ఎన్నో అడ్డంకులను అధిగమించి తవాంగ్కు చెందిన టెన్జియా యాంగ్కీ IPSలో చేరిన తొలి అరుణాచల్ప్రదేశ్ మహిళగా చరిత్ర సృష్టించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఆమె ప్రయాణాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ‘మొదటి వ్యక్తి కావడం ఎప్పుడూ సులభం కాదు. ఆమె వేసిన గెలుపు బాటలో ఎంతో మంది యువతులు పయనిస్తారు’ అని కొనియాడారు. ఇది తన ‘Monday Motivation’ అని రాసుకొచ్చారు.


