News December 20, 2024
నందిగం సురేశ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ

AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ప్రశాంత్ కుమార్ ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. నందిగం సురేశ్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News October 18, 2025
అఫ్గాన్ నుంచి టిప్స్ తీసుకోండి.. BCCI, కేంద్రంపై శివసేన ఫైర్!

పాక్ దాడుల్లో క్రికెటర్ల మృతితో ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు అఫ్గాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో Asia Cupలో పాక్‌తో టీమ్ ఇండియా ఆడటాన్ని గుర్తు చేస్తూ శివసేన(UBT) ఫైర్ అయింది. క్రీడల కంటే దేశానికి ప్రాధాన్యం ఇచ్చే విషయంలో Afghan నుంచి BCCI, కేంద్రం టిప్స్ తీసుకోవాలని మండిపడింది. PAKతో సిరీస్‌ను Afghan రద్దు చేసుకోవడం ఆనందం కలిగించిందని ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు.
News October 18, 2025
అధికారంలోకి వచ్చేస్తామని YCP కలలు కంటోంది: పార్థసారథి

AP: కల్తీ మద్యం కేసులో వాస్తవాలు బయటకొస్తుండడంతో YCP గోబెల్స్ ప్రచారాలకు దిగిందని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. కల్తీ మద్యం ఆ పార్టీ హయాంలోనే మొదలైందని విమర్శించారు. ‘మేము దానిపై ఉక్కుపాదం మోపుతున్నాం. సురక్షా యాప్, డిజిటల్ పేమెంట్లు తీసుకొచ్చాం. తక్కువ ధర లిక్కరూ అమ్ముతున్నాం’ అని పేర్కొన్నారు. అధికారుల మనోధైర్యాన్ని YCP దెబ్బతీస్తోందని, అధికారంలోకి వచ్చేస్తామని కలలు కంటోందని ఎద్దేవాచేశారు.
News October 18, 2025
MOILలో 99 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<