News October 7, 2024
నందిగం సురేశ్‌కు మళ్లీ రిమాండ్

AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. 2020లో వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళ చనిపోవడంతో హత్య కేసు నమోదైంది. ఈ కేసులో సురేశ్‌ను తుళ్లూరు పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు ఈనెల 21 వరకు రిమాండ్ విధించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇటీవల ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. అయితే పూచీకత్తు సమర్పించకపోవడంతో ఆయన గుంటూరు జైల్లోనే ఉన్నారు.
Similar News
News December 1, 2025
హసీనాపై మరో కేసు! భారత్‌పైనా ఆరోపణలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని <<18408910>>షేక్ హసీనా<<>>పై మరో కేసు పెట్టేందుకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం సిద్ధమైంది. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు షేక్ హసీనా కారణమని చెబుతోంది. ఆ హింసాకాండలో భారత్ ప్రమేయం కూడా ఉందని అక్కడి సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలో పేర్కొంది. బంగ్లా ఆర్మీని బలహీనపరిచేందుకు ఆ హింసకు భారత్ మద్దతు ఇచ్చిందని ఆరోపిస్తోంది. 2009 హింసాకాండలో సీనియర్ ఆర్మీ అధికారులు సహా 74 మంది మరణించారు.
News December 1, 2025
POK భారత్‌లో అంతర్భాగమే: JK హైకోర్టు

పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) భారత్‌లో అంతర్భాగమేనని, అక్కడ జరిగే వ్యాపారాన్ని ఇన్ట్రా స్టేట్ ట్రేడింగ్‌గా పరిగణించాలని జమ్మూ కశ్మీర్ హైకోర్టు చెప్పింది. GST అమలులోకి వచ్చినప్పటి నుంచి 2019లో POKలో వ్యాపారాన్ని నిలిపేసే వరకు జరిగిన ఎగుమతులు, దిగుమతులకు ట్యాక్స్ కట్టాలని అధికారులిచ్చిన నోటీసులపై వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. దీని విచారణలో భాగంగా హైకోర్టు ఈ కామెంట్లు చేసింది.
News December 1, 2025
ఈ కాల్స్/మెసేజ్‌లను నమ్మకండి: పోలీసులు

పార్సిల్లో డ్రగ్స్ అని ఫేక్ లింక్స్ పంపుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు X వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. ‘ఎలాంటి వస్తువునూ బుక్ చేయకుండానే పార్సిల్ గురించి కాల్స్, మెసేజ్‌లు వస్తే నమ్మకండి. ఇలాంటి కాల్స్‌తో భయపెట్టి ఖాతా ఖాళీ చేస్తారు. పార్సిల్లో డ్రగ్స్, నిషేధిత వస్తువులు ఉన్నాయని భయపెడతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వీటికి స్పందించకండి’ అని సూచించారు.


