News April 21, 2024
రాష్ట్రపతి, ప్రధానిని అందించిన ‘నంద్యాల’

AP: దేశానికి రాష్ట్రపతి, ప్రధానిని అందించిన MP నియోజకవర్గంగా నంద్యాల చరిత్రకెక్కింది. 1977 ఎన్నికల్లో 41 స్థానాల్లో INC గెలవగా, జనతా పార్టీ నుంచి నంద్యాలలో గెలిచిన ఏకైక MP నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారు. 1991లో PV నరసింహారావు PMగా ఎన్నికవడంతో ఆయన కోసం నంద్యాల సిట్టింగ్ MP గంగుల ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో PV.. BJP అభ్యర్థిపై 5.80 లక్షల మెజార్టీతో గెలిచారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News March 15, 2026
దీదీ వర్సెస్ మోదీ.. బెంగాల్‌లో దంగల్

బెంగాల్‌లో APR 23, 29న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో కాషాయాన్ని విస్తరిస్తున్న BJP బెంగాల్‌లోనూ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. మోదీ స్వయంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మరోవైపు TMC చీఫ్ మమతా బెనర్జీ(దీదీ) మరోసారి అధికారాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు. రాష్ట్రంలో కమలం వికసించకుండా చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో బెంగాల్‌లో దంగల్ ఫైట్ రసవత్తరంగా మారింది.
News March 15, 2026
మరణం కాదు.. నరకం నుంచి విముక్తి!

<<19352489>>హరీశ్ రాణా<<>> కేసులో ‘పాసివ్ యుథనేషియా’కు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఇది నేరుగా ప్రాణం తీసే ప్రక్రియ కాదు. కోలుకునే అవకాశం లేని రోగికి కృత్రిమంగా అందిస్తున్న వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్ వంటి లైఫ్ సపోర్ట్‌ను నిలిపేస్తారు. దీనివల్ల బాధితుడు తన అనారోగ్యం కారణంగా సహజంగా మరణిస్తారు. వాళ్లు పడే నరకయాతనను ముగించి గౌరవప్రదమైన మరణాన్ని అందించడమే ఈ వైద్య ప్రక్రియ ఉద్దేశం.
News March 15, 2026
ఏం సందేశం ఇస్తున్నారు?

డ్రగ్స్ కేసులో TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడటం రాజకీయ నాయకులపై ప్రజలకు అసహ్యం కలిగించేలా చేస్తోంది. వీకెండ్ వచ్చిందంటే చాలామంది నేతలు ‘ఎంజాయ్’ చేసేందుకే ఎగిరిపోతున్నారు. తీరా చూస్తే ఇలా ఫామ్‌హౌస్‌లు, పబ్‌లు, క్లబ్బుల్లో ‘గబ్బు’ పనులు చేస్తున్నారు. యువతకు లెక్చర్లు ఇచ్చే ఇలాంటి నేతలు మందు, విందు, డ్రగ్స్ తీసుకుంటూ వారికి ఏం సందేశం ఇస్తున్నారు?


