News February 26, 2025
‘ది పారడైజ్’లో బోల్డ్ & వైల్డ్‌గా నానీ!

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ది పారడైజ్’ నుంచి మార్చి 3న ‘RAW STATEMENT’ వీడియో రిలీజ్ కానుంది. దీని ఎడిట్ పూర్తయిందని, ఇందులో నాని బోల్డ్‌గా, వైల్డ్‌గా కనిపించనున్నారని & అనిరుధ్ మ్యూజిక్ అదిరిందని మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ఈ వీడియోపై అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. కాగా మొన్న రిలీజైన ‘HIT-3’ టీజర్‌లోనూ నానీని వైల్డ్‌గా చూపించారు.
Similar News
News February 26, 2025
రేపు స్కూళ్లకు సెలవు

APలో MLC ఎన్నికల కారణంగా కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఉండనుంది. గుంటూరు-కృష్ణా పట్టభద్రుల, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల, విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం టీచర్స్ MLC ఎన్నిక నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని DEOలు ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. మీకు రేపు సెలవు ఇచ్చారా? తెలంగాణలోనూ <<15581975>>సెలవు <<>>ఇచ్చారు.
News February 26, 2025
తేళ్లు, బొద్దింకలు కూడా తిన్నా: కామాక్షి భాస్కర్ల

తాను చైనాలో ఎంబీబీఎస్ చదువుకునే సమయంలో తేళ్లు, బొద్దింకలు కూడా తిన్నానని హీరోయిన్ కామాక్షి భాస్కర్ల తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి వంటకాలు ట్రై చేస్తానని చెప్పారు. ‘చైనాలో ఒకప్పుడు గ్రీనరీ ఉండేది కాదు. తినడానికి కూరగాయలు కూడా దొరికేవి కాదు. అందుకే కనిపించిన జీవుల్ని చంపి తినడం వారికి అలవాటైంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ‘మా ఊరి పొలిమేర’ సిరీస్ చిత్రాలతో కామాక్షి ఫేమస్ అయిన విషయం తెలిసిందే.
News February 26, 2025
సిగ్గులేని జీడి గింజలా రేవంత్ వ్యవహారం: KTR

BRS ప్రభుత్వం పనులు ఆపేయడం వల్లే SLBC ప్రమాదం జరిగిందన్న CM వ్యాఖ్యలపై KTR మండిపడ్డారు. ‘సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేంటి సిగ్గు అన్నదట. అలా ఉంది రేవంత్ వ్యవహారం. బాధ్యత గల CM అయితే రెస్క్యూ ఆపరేషన్‌పై దృష్టి పెట్టేవాడివి. ఎన్నికలు, ఢిల్లీ టూర్లకు తిరిగే నీకు పాలన అంటే ఏంటో తెలుసా? SLBC డిజైన్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని KCR ఎప్పుడో చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపించండి’ అని ట్వీట్ చేశారు.