News September 3, 2024
ఈ నెలలోనే నాని ‘హిట్-3’ షురూ?

‘సరిపోదా శనివారం’ విజయంతో జోరుమీదున్న నాని మరో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. శైలేష్ కొలను డైరెక్షన్లో హిట్-3 షూటింగ్ ఈ నెలలోనే మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ అనే ఐపీఎస్ పాత్రలో నాని కనిపించనున్నారు. దీంతో పాటు శ్రీకాంత్ ఓదెలతో సినిమాను సమాంతరంగా పూర్తి చేస్తారని టాక్.
Similar News
News December 8, 2025
మెదక్: రెండో విడతలో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏడు సర్పంచి స్థానాలు, 254 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 8 మండలాల్లో 142 సర్పంచి, 1,035 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి పదవులు ఏకగ్రీవమైన వాటిలో వెల్దుర్తి మండలం షౌకత్ పల్లి, నగరం, బస్వాపూర్, మెదక్ మండలం మల్కాపూర్ తండా, చిన్న శంకరంపేట మండలం మాందాపూర్ తండా, గవలపల్లి తండా, సంగాయపల్లి ఏకగ్రీవం అయ్యియి.
News December 8, 2025
మైసూరు పప్పు మాంసాహారమా?

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.
News December 8, 2025
ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.


