News March 13, 2025
నాని సవాల్.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే

తాను నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ సినిమా నచ్చకపోతే ‘హిట్-3’ చూడొద్దని హీరో నాని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కోర్టు’ మూవీని సినీ ప్రముఖులు, మీడియాకు ప్రీమియర్ షో ప్రదర్శించారు. మూవీ చూసిన దర్శకుడు శైలేష్ కొలను తన సినిమా(హిట్-3) సేఫ్ అని ట్వీట్ చేశారు. కోర్టు మూవీ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
Similar News
News November 22, 2025
కమిటీల నిర్మాణం, కూర్పుపై జనసేన ఫోకస్: హరిప్రసాద్

AP: పార్టీ బలోపేతంపై JSP చీఫ్ పవన్ ఫోకస్ పెట్టినట్లు పార్టీ ముఖ్యనేత హరిప్రసాద్ తెలిపారు. ‘కమిటీల నిర్మాణంపై కసరత్తు, నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై పవన్ దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ కమిటీల వరకు నిర్మాణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పార్టీ శ్రేణుల మనోగతం, సూచనలను కార్యాలయ కమిటీ నమోదు చేస్తోంది’ అని పేర్కొన్నారు.
News November 22, 2025
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు అరెస్ట్

శిక్ష అనుభవించడానికి రెడీ అవుతున్న కొద్ది రోజుల ముందే బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారోను శనివారం అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున హౌస్ అరెస్ట్‌లో ఉండి శిక్ష అనుభవిస్తారని సుప్రీంకోర్టులో శుక్రవారం లాయర్లు పిటిషన్ వేశారు. 2022 ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరుగుబాటుకు ప్రయత్నించిన బోల్సొనారోకు కోర్టు 27 ఏళ్ల 3 నెలల జైలు శిక్ష విధించింది. తీర్పును సవాలు చేస్తూ వేసిన అప్పీల్‌ను కొట్టేసింది.
News November 22, 2025
రోడ్డు ప్రమాదంలో సింగర్ మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో పంజాబీ సింగర్ హర్మన్ సిద్ధూ(37) మృతి చెందారు. మాన్సా-పాటియాలా రోడ్డులో వెళ్తుండగా ఆయన కారు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో హర్మన్ అక్కడికిక్కడే మరణించారు. బేబే బాపు, బబ్బర్ షేర్, కోయ్ చక్కర్ నై, ముల్తాన్ వర్సెస్ రష్యా తదితర సాంగ్స్‌తో ఆయన పాపులర్ అయ్యారు. హర్మన్ మృతితో అభిమానులు విషాదంలో మునిగిపోయారు.


