News August 29, 2024
నాని ‘సరిపోదా శనివారం’ పబ్లిక్ టాక్

నాని, వివేక్ అత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్లు యూఎస్లో పడ్డాయి. సినిమాలో నాని, SJ సూర్య నటన, వివేక్ టేకింగ్, జేక్స్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా సెకాండఫ్లో యాక్షన్ సీన్లు అదిరిపోయాయని చెబుతున్నారు. అయితే లెంగ్త్ ఎక్కువని, కథ ఊహించేలా ఉందని, టైం పాస్ అని మరికొందరు అంటున్నారు.
కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
Similar News
News January 22, 2026
ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ కార్యాలయంలో ఆయనను సుమారు 7 గంటల పాటు విచారించింది. పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు విజయసాయి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆర్థిక లావాదేవీలపై అధికారులకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు.
News January 22, 2026
500 వికెట్లు.. జలజ్ సక్సేనా రికార్డు

మహారాష్ట్ర ప్లేయర్ జలజ్ సక్సేనా (39 Yrs) దేశవాళీ క్రికెట్లో అరుదైన ఘనత సాధించారు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 500 వికెట్లు తీసిన ప్లేయర్గా రికార్డు సృష్టించారు. పుణెలో గోవాతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు తీసి ఈ మైలురాయిని అందుకున్నారు. అదే విధంగా 156 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 7,202 పరుగులు సైతం చేశారు. జలజ్ కంటే ముందు ఫస్ట్ క్లాస్లో 18 మంది 500 వికెట్లు తీశారు.
News January 22, 2026
5 ఏళ్లలో 14.88 లక్షల మందికి కుక్కకాట్లు

TG: పల్లె నుంచి పట్నం వరకు కుక్క కాట్ల ఘటనలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్లలో ఏకంగా 14,88,781 మంది కుక్క కాట్లకు గురయ్యారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ RTI ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. 2020-2025 మధ్య కుక్క కాటుకు గురైన వారి సంఖ్యను తెలిపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 36,07,989 రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొంది. 21,466 మంది పాము కాటుకు గురయ్యారంది.


