News August 20, 2024
నాని ‘సరిపోదా శనివారం’ స్టోరీ.. రివీల్ చేసిన సూర్య
నాని లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ బాగుండటంతో కథేంటోనన్న ఆసక్తి చాలామందిలో నెలకొంది. మూవీలో ప్రతినాయక పాత్రలో చేస్తున్న ఎస్‌జే సూర్య ఓ ఇంటర్వ్యూలో స్టోరీ వెల్లడించారు. ‘ఓ అబ్బాయికి కోపమెక్కువ. కంట్రోల్ చేసుకోలేడు. దీంతో వారంలో శనివారం మాత్రమే కోప్పడాలని, మిగతారోజులు శాంతంగా ఉండాలని అతడి తల్లి చెబుతుంది. వారమంతా సైలెంట్‌గా ఉండే ఆ కుర్రాడు, శనివారం మారిపోతుంటాడు. అదే కథ’ అని వివరించారు.
Similar News
News January 23, 2025
సైఫ్‌ను కాపాడిన ఆటో డ్రైవర్‌కు ₹లక్ష ఇస్తా: సింగర్
సైఫ్ అలీఖాన్‌ను ఆస్పత్రికి తరలించిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్‌ను బాలీవుడ్ సింగర్ మికా సింగ్ ప్రశంసించారు. ఫేవరెట్ సూపర్ స్టార్‌ను కాపాడిన ఆటో డ్రైవర్‌కు కనీసం రూ.11 లక్షల రివార్డ్ అయినా ఇవ్వాలి. ఆయన వివరాలు చెప్పండి. నా తరఫున రూ.లక్ష ఇవ్వాలనుకుంటున్నా’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా ఇవాళ ఆటో డ్రైవర్‌ను సైఫ్ కలిసి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.
News January 23, 2025
దావోస్‌లో అందరం ఒక్కటే: సీఎం చంద్రబాబు
చరిత్రలో మొదటిసారి భారత్ తరఫున అందరం కలిసి మాట్లాడుతున్నామని AP సీఎం చంద్రబాబు అన్నారు. ‘భారత్ నుంచి పలు పార్టీలు వచ్చినా దావోస్‌లో అందరం ఒక్కటే. గతంలో ఒకరిద్దరు సీఎంలు, కేంద్రమంత్రులు వచ్చేవారు. భారత్ ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏపీ సుస్థిరాభివృద్ధికి చాలా కష్టపడాలి’ అని దావోస్ ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు అన్నారు. ఇందులో భారత్ నుంచి వెళ్లిన వివిధ రాష్ట్రాల నేతలు పాల్గొన్నారు.
News January 23, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 23, గురువారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.31 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.07 గంటలకు ✒ ఇష: రాత్రి 7.22 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.