News March 9, 2025
‘ది ప్యారడైజ్’లో నాని షాకింగ్ రోల్?

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ది ప్యారడైజ్’ మూవీ ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నుంచి మరో న్యూస్ వైరలవుతోంది. ఇందులో నాని ట్రాన్స్ జెండర్‌గా కనిపిస్తారని టాక్. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో రెండు జడలతో ఊర మాస్ లుక్‌లో నాని దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రచారంపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Similar News
News March 9, 2025
GOOD NEWS.. చేనేత కార్మికులకు రుణమాఫీ

TG: చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.33 కోట్ల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు ఇచ్చింది. ఒక్కో కార్మికుడికి రూ.లక్ష వరకు రుణమాఫీ కానుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న లోన్లకు ఇది వర్తించనుంది.
News March 9, 2025
సెలవు ఇవ్వలేదు.. సెలైన్ బాటిల్‌తోనే పాఠశాలకు వచ్చిన టీచర్

ఒడిశాలో ఒక ఉపాధ్యాయుడు సెలైన్ బాటిల్‌తోనే పాఠశాలకు వచ్చారు. ప్రకాశ్ భోయ్ అనే వ్యక్తి ఈనెల 6న తన తాత మరణించడంతో అంత్యక్రియలకు వెళ్లారు. అక్కడ అనారోగ్యానికి గురయ్యారు. సెలవు కావాలని కోరగా ప్రిన్సిపల్ నిరాకరించారు. దీంతో ప్రకాశ్ సెలైన్ బాటిల్‌తోనే విధులకు హాజరయ్యారు. వెంటనే తోటి ఉపాధ్యాయులు అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యాధికారి పేర్కొన్నారు.
News March 9, 2025
గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్‌గా మాథ్యూ వేడ్

IPL: గుజరాత్ టైటాన్స్ జట్టు తమ మాజీ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. ట్విటర్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ‘ఛాంపియన్, పోరాట యోధుడు. ఇప్పుడు మా అసిస్టెంట్ కోచ్. మన డగౌట్‌కి తిరిగి స్వాగతం వేడ్’ అని పేర్కొంది. ప్రస్తుతం ఆ జట్టుకు ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్‌గా, ఆశిష్ కపూర్, నరేందర్ నేగి సహాయక కోచ్‌లుగా, పార్థివ్ పటేల్ బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు.